Advertisement
Google Ads BL

ఫ్యామిలీతో కలిసి తిరుమలకు మెగాస్టార్


రేపు ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. మెగాస్టార్ చిరు బర్త్ డే అంటే అభిమానులకు పండగే. సంక్రాంతి, దసరా పండగల కన్నా ఎక్కువగా చిరు బర్త్ డే ని మెగా ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటారు. కేక్ కటింగ్స్, బ్లడ్ డొనేషన్స్ అంటూ హంగామా చేస్తారు. అంతేకాదు మెగాస్టార్ నటిస్తున్న చిత్రాల నుంచి స్పెషల్ అప్ డేట్స్ తో సోషల్ మీడియా కూడా కోలాహలంగా మారిపోతుంది. 

Advertisement
CJ Advs

ఇదంతా ఓకె. మరి మెగాస్టార్ బర్త్ డే కి ఆయన ఏం చెయ్యబోతున్నారు, ఆయన బర్త్ డే ప్లాన్స్ ఏమిటి అనేది కొద్ధి కొద్దిగా రివీల్ అవుతున్నాయి. అందులో మొదటగా ఈరోజే చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి తిరుమల చేరుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రేణి గుంట వెళ్లి అక్కడ నుంచి తిరుమలకు చేరుకొని రేపు పుట్టిన రోజు స్పెషల్ గా ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

అక్కడ నుండి తిరిగి మెగాస్టార్ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ కి రానున్నారు. మరి వచ్చాక ఇక్కడ చిరు ఇంట్లో పార్టీ లాంటిది ఏమైనా ఉపాసన-రామ్ చరణ్ లు ప్లాన్ చేస్తున్నారో, లేదో అని మెగా ఫ్యాన్స్ చాలా ఆత్రంగా ఉన్నారు.  

Megastar to Tirumala with family:

Chiranjeevi To Spend His Birthday In The Presence Of Lord Venkateswara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs