జూన్ 1 న బెంగుళూరు రేవ్ పార్టీ జరిగిన రోజున పోలీసులకు దొరికిపోయి అది నేను కాదు అంటూ బుకాయిస్తూనే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి బెంగుళూరు వెళ్లి విచారణకు హాజరైన నటి హేమ.. కొద్దిరోజులు జైలులో కూడా ఉంది. అయినా కూడా ఆ పార్టీలో నేను పాల్గొనలేదు, కావాలనే మీడియా నన్ను బద్నామ్ చేస్తుంది అంటూ మీడియా మీద విరుచుకుపడిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా కూడా హేమా తనని మీడియా నే టార్గెట్ చేసింది, నేను ఏ తప్పు చెయ్యలలేదు, హేమక్క నిప్పు, నా మీద ఇలాంటి రూమర్స్ వలన మా అమ్మగారు తలదించుకుని కుమిలిపోయారు అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి తాను నిప్పు తానేమి తప్పు చేయలేదని తనపై మీడియానే కావాలని దుష్ప్రచారం చేసింది అంటుంది.
బెంగుళూరు రేవ్ పార్టీలో వ్యవహారంలో ప్రముఖంగా వినిపించిన పేరు హేమది. తన బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, నేను డ్రగ్స్ తీసుకోలేదు, అది రేవ్ పార్టీ కాదు, బర్త్ డే పార్టీ, నా టెస్ట్ ల్లో నెగిటివ్ వచ్చింది, రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నస్తున్నా అంటూ చెప్పిన హేమ కొందరు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు, నేను దేనికైనా రెడీ అంటూ వీడియోను విడుదల చేసింది.