నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వారు మూడేళ్ళ కు మించి కలిసి ఉండరు, ఓ లేడీ వల్ల విడిపోతారంటూ జాతకం చెప్పిన వేణు స్వామి పై జర్నలిస్ట్ సంఘాలు మహిళా కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వేణు స్వామి పై మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యింది. మరోపక్క మా అధ్యక్షుడు విష్ణు కూడా వేణు స్వామికి వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ విషయంలో వేణు స్వామి కాస్త తగ్గుతూ తాను ఇకపై సెలెబ్రిటీ జాతకాలు చెప్పను అన్నాడు. వేణు స్వామి పై ఇష్యు పెద్దదవుతున్న సమయంలో వేణు స్వామి ఆయన వైఫ్ వీణ శ్రీవాణిలు ఉన్నట్టుండి తమని టీవీ మూర్తితో పాటుగా కొంతమంది ఫిలిం జర్నలిస్ట్ లు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ, తమకి ఆత్మహత్యే శరణ్యమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
తాము ఎవరిని బ్లాక్ మెయిల్ చెయ్యలేదు, ఇదంతా ఫేక్ అంటూ ఫిలిం జర్నలిస్ట్ లు వేణు స్వామి విషయంలో ఫైర్ అవుతూనే మధుర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై.జె.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రసాదం రఘు లు మధురనగర్ పోలీసులకు కంప్లైంట్ చేసారు.