Advertisement
Google Ads BL

తమిళ్ ఇండస్ట్రీపై సంగీత సంచలన కామెంట్స్


ఖడ్గం సినిమా చూసిన వారు సంగీతను ఎప్పటికి మరిచిపోలేరు. సినిమా అవకాశాల కోసం పల్లెటూరి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఎన్ని ఇబ్బందులు పడతారో అనేది సంగీత కేరెక్టర్ ద్వారా దర్శకుడు కృష్ణవంశీ చూపించారు. సంగీత ఒరిజినల్ లైఫ్ లోను అదే కేరెక్టర్ తో ఆమె సినీ రంగ ప్రవేశ చేసింది. అయితే తెలుగులో అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సంగీత తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ మెరిసింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం చాలా అరుదుగా సినిమాలు చేస్తున్న సంగీత తాజాగా తమిళ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తనకు తమిళ్ సినిమాల్లో కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని చెప్పింది. తమిళ సినిమా ఇండ‌స్ట్రీలో కంటే తెలుగులోనే న‌టుల‌కు ఎక్కువ గౌరవం లభిస్తుంది. ఈ మాట‌లు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసినా నేను పెద్దగా పట్టించుకోను. 

నేను చెప్పేది అక్షర సత్యం. తమిళ సినిమాల్లో న‌టించేట‌ప్ప‌డు నాకు సరైన గౌరవం కానీ మర్యాద కానీ  ఉండేవి కావు. తమిళ సినిమాల్లో అవ‌కాశాలు కావాల‌ని నేను ఎవ‌రీని అడగలేదు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో నాకు అవకాశాలు రావ‌డంతోపాటు ఆదరణ కూడా ల‌భించేది. అంతేకాదు, మంచి పారితోషికం కూడా తెలుగులోనే ల‌భిస్తుంది అంటూ సంగీత చెప్పుకొచ్చింది. 

Sangeetha sensational comments on the Tamil industry:

Sangeetha says Telugu industry is better than Tamil industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs