గ్లోబల్ స్టార్ కి బావమరిది అయితే, యంగ్ టైగర్ భార్యకి తమ్ముడైతే ప్రేక్షకులు ఆదరించెయ్యరు. అతనిలో టాలెంట్ ఉండాలి, కంటెంట్ లో బలం ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాని అక్కునచేర్చుకుంటారు. ఆగష్టు 15 న విడుదలైన మీడియం బడ్జెట్ సినిమాల మీద చిన్న సినిమా గెలవడమనేది కంటెంట్ మీద ఉన్న నమ్మకమే.
ఆగష్టు 15 న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతోనే కాదు హీరో విక్రమ్ నటించిన తంగలాన్ డబ్బింగ్ మూవీతో పోటీకి సై అన్నాడు ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్. ఆయ్ అంటూ గోదారి యాసతో పలకరించేందుకు సిద్దమైన నితిన్ ని అందరూ విచిత్రంగా చూసారు. పెద్ద సినిమాల మద్యన నలిగిపోతాడు అనుకున్నారు.
కానీ ఆగష్టు 15 ప్రీమియర్స్ తోనే ఆయ్ కి అద్భుతమైన టాక్ వచ్చేసింది. అటు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండూ డల్ అవడంతో ఆయ్ చిత్రం రెపరెపలాడింది. లో బడ్జెట్ చిత్రం.. అటు చూస్తే కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. సోమవారం కూడా బుక్ మై షో లో ఆయ్ హావ నడిచింది. అందుకే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ థియేటర్స్ లో కొన్నిటిని ఆయ్ కి కేటాయించడం చూస్తే కంటెంట్ బలంగా ఉంటే ఎవరాపగలరు అని అనకమానరు.
నిర్మాత బన్నీ వాస్ చేసిన ప్రమోషన్స్, నితిన్ నార్నెతో పాటు కమెడియన్లు కసిరెడ్డి, అంకిత్ కొయ్యని కామెడీ అన్ని ఆయ్ కి కలిసొచ్చాయి. అందుకే సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.