మాస్ మహారాజ్ రవితేజ కి అభిమానులు కాదు ఆడియన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వరస సినిమాలతో నిరాశ పరుస్తున్న రవితేజ ని కొత్తగా సినిమాలు చెయ్యాలని అడగడమే కాదు.. ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడంటూ ఎన్నిసార్లు చెబుతారంటూ వారు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. క్రాక్ తర్వాత వచ్చిన ఖిలాడీ, ఈగల్, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరావు అన్ని వరసగా నిరాశ పరిచే సినిమాలే.
ధమాకా 100 కోట్లు కొల్లగొట్టింది. కానీ ఆ సక్సెస్ లో మేజర్ పార్ట్ ని శ్రీలీల పట్టుకుపోయింది. ఇక మిస్టర్ బచ్చన్ కూడా ఇప్పుడు ఆడియన్స్ ని డిజ్ పాయింట్ చేసింది. దానితో ఆడియన్స్ తో పాటుగా అభిమానులు అందరూ రవితేజ విషయంలో కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
అందులో ఓ పోస్ట్ ని మీరే చూడండి..
ఎవరి సపోర్ట్ లేకుండా పైకొచ్చాడు ... ఇంకెన్నాళ్లు ఇదే సింపతీ కార్డ్ వాడతార్రా నాయానా, ఈయన తీసే పది సినిమాల్లో 8 అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయ్, అందులోను ప్రతి సినిమాలో చాలా చిన్న వయసున్న హీరోయిన్లతో అసభ్యకరమైన సీన్లతో పరిది దాటి రొమాన్స్ చేస్తుంటాడు..
ఈయనేమో ప్రతి సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీస్కుంటాడు, ఈయనని నమ్మి డబ్బు పెట్టే నిర్మాతలు నానా స*కలు నా**పోతున్నారు 🙏🙏, కథలు బలంగా ఉండవు, కథనం వరస్ట్, దానికితోడు ఇంకా హీరోయిన్లతో 🙏🙏🙏 దండం అన్నా నీకు తియ్యాలనిపిస్తే మంచి సినిమాలు చెయ్ లేకపోతే మానెయ్🙏producer పొట్టలు& ticket కొనే ప్రేక్షకుడి జేబు కొట్టకు..
We want #Kick #Vikramrkudu #idiot #khadgam Raviteja అంటూ ఆడియన్స్ రవితేజని రిక్వెస్ట్ చేస్తున్నారు.