గత వారం రోజులుగా కుర్ర హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి వేడుకలు గ్రాండ్ గా మొదలైపోయాయి. మార్చ్ 13 న హీరోయిన్ రహస్య గోరఖ్ తో నిశ్చితార్ధం చేసుకున్న కిరణ్ అబ్బవరం ఈ నెల22 అంటే మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రహస్యని కిరణ్ అబ్బవరం ప్రేమ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే కిరణ్ అబ్బవరం వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా కేరళలో జరగబోతుంది అనే టాక్ నడిచినా, తాజా సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవరం వివాహం రహస్య గోరఖ్ సొంత ఊరు కర్నాటకలోని కూర్గ్ లో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ కూర్గ్ లోనే రహస్య రిలేటివ్స్ ఉండడంతో కిరణ్ రహస్యల వివాహాన్ని కూర్గ్ లోనే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.
కిరణ్ అబ్బవరం-రహస్యల వివాహానికి కిరణ్ అబ్బవరం తరుపున అతని పేరెంట్స్, కొద్దిమంది దగ్గర బందువులతో పాటుగా స్నేహితులు హాజరవుతారని తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి కిరణ్ వివాహానికి ఎవరు హాజరవుతారో అనేది తెలియాల్సి ఉంది.