విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ మూవీ ప్రేక్షకులను నిరాశ పరడమే కాదు.. దర్శక-నిర్మాత అయిన పూరి జగన్నాధ్ ని ముంచేసింది. ఒకపక్క లైగర్ నష్టాలు, మరోపక్క ఈడీ ప్రశ్నలతో పూరి జగన్నాధ్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. మరోపక్క లైగర్ బయ్యర్లు నష్టాలను పూడ్చమంటూ నస .
డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ టైమ్ లోను లైగర్ సమస్యతో పూరి సతమతమయ్యాడు. ఎలాగో 40 పర్సెంట్ లైగర్ నష్టాల రికవరీకి ఒప్పుకుని డబుల్ ఇస్మార్ట్ కి సమస్య లేకుండా చేసుకున్నారు. అక్కడికి లైగర్ ప్రాబ్లెమ్ తీరిపోయింది. కానీ ఇప్పుడు పూరి జగన్నాధ్ కి మళ్ళి డబుల్ ఇస్మార్ట్ రూపంలో కష్టాలు మొదలయ్యాయి.
గత గురువారం భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యన విడుదలైన డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ఆడియన్స్ నుంచి వచ్చిన టాక్, సినీ విమర్శకులు ఇచ్చిన రివ్యూస్ చూసాక ప్రేక్షకులు ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తిని తగ్గించేశారు. వరసగా ఐదు రోజులు సెలవలు ఉన్నప్పటికి.. అందరూ చిన్న సినిమా ఆయ్ ని చూజ్ చేసుకుంటున్నారు.
దానితో డబుల్ ఇస్మార్ట్ కూడా పూరి జగన్నాధ్ కి ఝలక్ ఇచ్చేలా కనిపిస్తుంది. వీకెండ్ లోనే ఇలా ఉంటే వీక్ డేస్ మొదలైతే డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి ఏమిటో అనేది ఈపాటికే అందరికి అర్ధమైపోయి ఉంటుంది. పూరికి లైగర్ నష్టాలు వదిలినా ఇస్మార్ట్ కష్టాలు మొదలైనట్టే కనబడుతుంది వ్యహారం..!