Advertisement
Google Ads BL

దువ్వాడ పొలిటికల్ కెరీర్ ఖతమ్!


అదేదో అంటారే.. ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె! అనే మాట సరిగ్గా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిజ జీవితంలో చోటుచేసుకున్నది.! ఎందుకంటే దివ్వెల మాధురి అనే మహిళ.. ఆయన జీవితంలో రాక మునుపు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగేది..! ఎప్పుడైతే బోసిపోయి ఉన్న దువ్వాడ ఇంట్లో దివ్వెలు వెలిగిస్తానని మాధురీ వచ్చిందో ఆప్పట్నుంచి అంతా ఆరిపోయింది..! ఎంతలా అంటే.. కుటుంబంలో లేనిపోని సమస్యలు, కట్టుకున్న భార్య, కన్న కుమార్తెలు ఛీ కొట్టిన.. కొడుతున్న పరిస్థితి. ఆఖరికి నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు చీదరించుకుంటున్న పరిణామాలు ఇలా ఒకటా రెండా.. కోకొల్లలు.!

Advertisement
CJ Advs

ఖేల్ ఖతమేనా..?

దువ్వాడ మంచి రాజకీయ నాయకుడే.. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీకి సరైనోడే.. అంతకుమించి మాస్ లీడర్. వాక్ఛాతుర్యం లీడరే.. ఎప్పుడైతే ఈయనలోని ఆటగాడు బయటపడ్డారో అప్పుడే అసలు సినిమా మొదలైంది. ఒకరోజు ఫస్ట్ లుక్.. ఇంకోరోజు టీజర్.. మరుసటి రోజు ట్రైలర్.. ఈ గ్యాప్‌లోనే డైరెక్టుగా పిక్చరే రిలీజ్ అయిపోయింది. దీని ఫలితం మాధురీ వర్సెస్ దువ్వాడ వాణి. సీన్ కట్ చేస్తే దువ్వాడ, మాధురి ఇంటి ముందు వాణి తిష్టవేయడంతో ఈ సినిమా మరింత రంజుకుంది. గట్టిగా అనుకుంటే దువ్వాడ, దివ్వెల ఔర్ వాణి అని ఓ సినిమానే తీసేయచ్చు. ఇక రీల్ సంగతి పక్కనెట్టి రియల్ లైఫ్ విషయానికొస్తే.. దువ్వాడ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లే అని ఇప్పటికే వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

ఎందుకు.. ఏమిటి..!?

రాజకీయాలంటే ఆసక్తి అని.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ అంతా పాలిటిక్స్ కావడంతో దువ్వాడ వాణి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేశారు. అది కూడా సొంత భర్తపైనే పోటీ కావడంతో ఇదొక రాద్ధాంతమే అయ్యింది. ఆ తర్వాత వైసీపీ పెద్దలు ఎంటరవ్వడంతో.. నామినేషన్లు కూడా విత్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక తగ్గేదేలే.. దువ్వాడ విడాకులు ఇచ్చినా ఇవ్వకున్నా.. రానున్న ఎన్నికల్లో వాణి పోటీ చేస్తుంది. అయితే తాను కూడా బరిలోకి దిగుతానని ఓ ఇంటర్వ్యూ వేదికగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాధురీ ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. అయితే ఏ నియోజకవర్గం..? ఏ పార్టీ నుంచి..? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం మాధురీ మాటలో నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

అటు.. ఇటూ రెండూ..!

ఆర్థికంగా, రాజకీయంగా గట్టిగానే ఉన్న మాధురీ ఎట్టి పరిస్థుతుల్లోనూ బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నట్లు మనసులో మాట చెప్పేసింది. వాస్తవానికి వైసీపీలో యాక్టివ్ ఉన్న నేత ఆమె.. నేరుగా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసే రేంజ్ కూడా ఉంది. దువ్వాడ గత ఎన్నికల్లో సుమారు రెండున్నర కోట్లుపైనే అని తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి టికెట్ దక్కించుకుంటుందా..? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు దువ్వాడ వాణి కూడా పోటీ చేసి తీరాల్సిందేనని కంకణం కట్టి కూర్చుంది. చూశారుగా ఉన్నదీ పాయె.. ఉంచుకున్నది పాయే.. ఆఖరికి పొలిటికల్ కెరీర్ కూడా దువ్వాడే చేజేతులారా సర్వనాశనం చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో..!

Duvvada political career is doomed!:

Is Duvvada Srinivas political career over?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs