Advertisement
Google Ads BL

పారితోషికం ఉంటే చాలా రవితేజా..?


మాస్ మహారాజ్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. కేవలం పారితోషికం కోసమే సినిమాలు చేస్తున్నాడా, పారితోషికం మాత్రమే చూసుకుంటాడా రవితేజా.. అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రశ్నించుకునేలా రవితేజ సినిమాలు కనిపిస్తున్నాయి. ఒకటా రెండా వరసగా రవితేజ నిరాశపరిచే సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను డిజ్ పాయింట్ చేస్తున్నాడు. క్రాక్ తో ట్రాక్ లో కొచ్చిన రవితేజ మళ్ళి పాత పాటే పాడాడు. 

Advertisement
CJ Advs

ధమాకా విషయంలోను శ్రీలీల మ్యాజిక్ పని చేసింది కాబట్టి సేవ్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాలు కూడా అవుట్ డేటెడ్ స్క్రిప్ట్స్. కథ విన్నప్పుడే అది ప్రేక్షకులకు రీచ్ అవుతుందా అనేది రవితేజ అంచనా వెయ్యలేకపోతున్నాడా.. అతనేమీ కొత్తగా సినిమాలు చెయ్యడం లేదు. ప్రేక్షకుల నాడి గురించి తెలియదు అనుకోవడానికి. 

దర్శకులు రవితేజ కి చెప్పింది ఒకటి చేసేది ఒకటా అంటే రవితేజ చిన్న హీరో కాదు. మరి ఎక్కడ తేడా కొడుతోంది. తాజాగా హిట్ ఇస్తాడని నమ్మిన హరీష్ శంకర్ కూడా మిస్టర్ బచ్చన్ చిత్రంతో రవితేజ నమ్మకాన్ని వమ్ము చేసాడు. హిందీ రైడ్ కి హరీష్ శంకర్ చేసిన మార్పుల గురించి రవితేజ డీప్ గా గమనించి ఉంటే అవుట్ ఫుట్ మరోలా వచ్చేదేమో. 

హీరోయిన్ తో డాన్స్ చేసి, ఆమెని అందంగా చూపించేస్తే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే అది మిస్టర్ బచ్చన్ రిజల్ట్ లానే ఉంటుంది. నిర్మాతలు అడిగిన పారితోషికం ఇస్తున్నారు.. మనకి ఇంకేం కావాలి అన్నట్టుగా రవితేజ సినిమాలు చేస్తున్నాడు. పారితోషికం  విషయంలో మైత్రి వారు రవితేజని పక్కనబెట్టినట్టే మిగతా నిర్మాతలు కూడా డెసిషన్ తీసుకోకముందే రవితేజ తన పద్దతి మార్చుకోవాలనే సలహాలు కూడా రవితేజకి వస్తున్నాయి. చూద్దాం రవితేజ ఇకపై ఏం చేస్తాడో అనేది.!

Ravi Teja prefers Remuneration over Scripts:

Ravi Teja Remuneration is a Major Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs