Advertisement
Google Ads BL

హరిహర వీరమల్లు.. మరో అప్డేట్


ఆగిపోయిందనే వార్తల నుంచి వరస అప్డేట్స్ వరకు వచ్చింది హరిహర వీరమల్లు వ్యవహారం. శుక్రవారమే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చిందో లేదో.. మరో అప్డేట్‌ను శనివారం మేకర్స్ వదిలారు. తద్వారా ఈ సినిమా ఫుల్ స్వింగ్‌లో ఉందని చెప్పడం నిర్మాతల ఉద్దేశ్యం కావచ్చు. ఏదయితేనేం.. అసలు ఉంటుందా? ఉండదా? అనే సందేహాల నుంచి.. కచ్చితంగా ఉంటుందనే క్లారిటీని అయితే మేకర్స్ ఇచ్చారు.. ఇస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే..

Advertisement
CJ Advs

శుక్రవారం హరిహర వీరమల్లు షూట్ గురించి అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. శనివారం ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న నిధి అగర్వాల్ స్టన్నింగ్ పోస్టర్‌ని విడుదల చేసి.. ఇది మాములు సినిమా కాదనే అభిప్రాయాన్ని మరోసారి ఫ్యాన్స్‌లోనూ, ప్రేక్షకులలోనూ కల్పించారు. శనివారం నిధి అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో నిధి మహాలక్ష్మి దేవి అవతారంగా, బంగారు చీరలో, నగలతో మెరిసిపోతూ కనిపిస్తోంది. తనదైన అందాల నిధితో ఆమె మాయ చేసేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్ట్ 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hari Hara Veera Mallu Special Update:

Niddhi Agerwal Birthday Greetings Poster From Hari Hara Veera Mallu <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs