Advertisement
Google Ads BL

హరిహర వీరమల్లు షూట్ మొదలైంది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించుకుంది. ఇటీవల ఏపీలో ఎన్నికలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలతో.. కొన్నాళ్లు ఈ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిర్మాత ఏఎం రత్నం ఖండించారు కూడా. అలాగే ఈ వాయిదా కారణంగా దర్శకుడు క్రిష్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

Advertisement
CJ Advs

క్రిష్ స్థానంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అంగీకరించిన ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయాలని సంకల్పించుకోవడంతో.. కొంత మేరకు షూటింగ్ జరుపుకున్న ఆయన చిత్రాలన్నీ సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఈ క్రమంలో ముందుగా హరిహర వీరమల్లు షూట్ మొదలైనట్లుగా తెలుస్తోంది. యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ నేతృత్వంలో ఓ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణ మొదలైనట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 14 నుంచి ఈ షూట్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 400 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని, అతి త్వరలో పవన్ కళ్యాణ్ ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారనేది తాజా అప్డేట్. 

Harihara Veera Mallu Shooting Update:

HariHara Veeramallu Shooting in Progress.. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs