Advertisement

రోజా వంతు వచ్చేసిందోచ్!


ఆంధ్రప్రదేశ్‌ను 2019-2024 వరకు ఏలిన వైసీపీ ప్రభుత్వంపై కూటమి అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తోంది. ఏయే శాఖల్లో అవినీతి జరిగింది..? ఎంత మేరకు జరిగింది..? అని లెక్కలు తీసే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. దీనికి తోడు స్వచ్ఛంద సంస్థలు, ఎవరైనా సామాజికవేత్తలు, రాజకీయ నేత కోర్టులు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలను ఒక్కొక్కరిని వరుస పెడుతున్న టీడీపీ.. ఇప్పుడు మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా సెల్వమణి దగ్గరకు వచ్చి ఆగింది.

Advertisement

ఎందుకు.. ఏమిటి..?

వైసీపీ హయాంలో టూరిజం, క్రీడల శాఖా మంత్రిగా రోజా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది ఎప్పడ్నుంచో వస్తున్న ప్రధాన ఆరోపణ. అందుకే రోజాపై సీఐడీకి ఫిర్యాదు వచ్చింది. చర్యలు తీసుకోవాలని, అవినీతిని కక్కించాలని డిమాండ్ చేస్తూ ఆట్యపాట్య సంస్థ సీఈవో సీఐడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయనతో పాటు నాడు మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌పైనా విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తేల్చాలని ఎన్డీఆర్ జిల్లా సీపీని సీఐడీ ఏడీజీ ఆదేశించారు. వాస్తవానికి.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అవినీతి బాగోతాలు బయటికి తీస్తుండగా సరిగ్గా ఈ సమయంలోనే రోజాపైన ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి.

ఇంకా ఎవరో..!

అగ్రిగోల్డ్ స్కామ్ బయటపడటంతో మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ చుక్కలు చూస్తోంది..! రేపొద్దున్న పేర్ని నాని, ఆ తర్వాత కొడాలి నాని వంతు అని ప్రచారం జరుగుతున్న సమయంలో రోజా, ధర్మాన పేర్లు బయటికి వచ్చాయి. ఇప్పుడు సీఐడీ ఏం చేయబోతోంది..? రోజా ఎలా రియాక్ట్ అవుతారు..? అసలే సొంత నియోజకవర్గం, రాష్ట్రం వదిలేసి తమిళనాడు, విదేశాల్లో విహరిస్తున్న ఆమె విచారణకు వస్తారా..? ఒకవేళ వస్తే ఎవర్ని ఇరుకున పెట్టబోతున్నారు..? మాజీ మంత్రులతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఇరుక్కుంటారా..? వాట్ నెక్స్ట్ అంటూ రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏమో ఏమైనా జరగొచ్చు.. చూస్తూ ఉండాల్సిందే..!

Case Filed on Roja:

Roja in Problems
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement