Advertisement
Google Ads BL

పెయిడ్ ప్రీమియర్స్ దెబ్బేశాయిగా!


తమ సినిమాల మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటేనో కానీ.. దర్శకనిర్మాతలు ముందుగా ప్రీమియర్స్ పేరు ఎత్తరు. చిన్న సినిమాలు ప్రమోషన్స్ కోసమని ప్రీమియర్స్ ప్లాన్ చేసుకుని.. సినిమాపై అంచనాలు క్రియేట్ చేసుకునేలా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దిగుతారు. పెయిడ్ ప్రీమియర్స్, ప్రీమియర్స్ అంటూ చాలా సినిమాలు హంగామా చేసినా వాటికి ప్రీమియర్ టాక్ ప్లస్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు రవితేజ-హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్‌కి ఆ పెయిడ్ ప్రీమియర్స్ దెబ్బేశాయనే టాక్ వినిపిస్తుంది. రిలీజ్‌కు ఒక రోజు ముందు అంటే బుధవారమే మిస్టర్ బచ్చన్‌కి పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. అయితే సినిమాకి హిట్ టాక్ స్ప్రెడ్ అయితే ఆ పెయిడ్ ప్రీమియర్స్ వర్కౌట్ అయ్యేవి. కానీ మిస్టర్ బచ్చన్‌కి యావరేజ్ టాక్ కూడా రాలేదు. 

రవితేజ-హరీష్ శంకర్ కలయికపై ఎన్నో అంచనాలు పెట్టుకుని వెళ్లిన వాళ్ళు డిజప్పాయింట్ అవుతూ థియేటర్స్ నుంచి బయటికి వస్తున్నారు. సాంగ్స్ బావున్నా, కేవలం హీరోయిన్ అందాలపై హరీష్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అంటూ ఆడియన్స్ హరీష్ శంకర్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అవుట్ డేటెడ్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ సినిమాని చెడగొట్టారు అంటూ మాట్లాడుతున్నారు. 

సోషల్ మీడియాలో కేవలం మీడియా వాళ్ళు మాత్రమే మిస్టర్ బచ్చన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ బావుంది, సాంగ్స్ అదుర్స్ అంటూ ట్వీట్లు వేస్తున్నా.. కామన్ ఆడియన్స్ మాత్రం మిస్టర్ బచ్చన్ విషయంలో నెగెటివ్ గా మాట్లాడడం ఆ సినిమా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు అంటూ మాట్లాడుకుంటున్నారు. సో మిస్టర్ బచ్చన్ కి పెయిడ్ ప్రీమియర్స్ దెబ్బేశాయనే చెప్పాలి. 

Paid Premieres Effect to Mr Bachchan Movie:

Negative Talk to Mr Bachchan Movie in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs