Advertisement
Google Ads BL

అమల మాదిరి శోభిత చేయగలదా?


అక్కినేని నాగార్జున మొదటగా హీరో వెంకటేష్ సోదరి లక్ష్మీని వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య పుట్టిన తర్వాత మనస్పర్ధలతో నాగార్జున, లక్ష్మీ విడిపోయారు. ఆ తర్వాత తనతో కలిసి సినిమాలు చేసిన అమలను నాగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమల నాగ్‌తో పెళ్ళికి ముందు మెగాస్టార్ చిరు, నాగార్జున ఇలా వరస సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. 

Advertisement
CJ Advs

అయితే నాగార్జునతో వివాహం తర్వాత అమల యాక్టింగ్‌కి దూరంగా ఉంటుంది. ఈమధ్యన ఒకటి రెండు సినిమాల్లో నటించినా అమ్మ పాత్రల్లో నటిస్తూ అక్కినేని లెగసీని కాపాడుతుంది. ఇక నాగ చైతన్య తన లైఫ్‌లో సమంతతో ప్రేమ వివాహం తర్వాత విడాకులు తీసుకున్నాడు. సమంతకి చైతూకి మధ్యన మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. 

ఇక ఇప్పుడు నాగ చైతన్య మరో హీరోయిన్ శోభిత దూళిపాళను ప్రేమించి రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. దీంతో తండ్రి నాగార్జునని చైతు ఫాలో అవుతున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శోభిత దూళిపాళ గ్లామర్ రోల్స్‌తో కెరీర్‌లో ముందుకు వెళుతోంది. అలాంటి భామ మరి పెళ్ళయ్యాక అమల యాక్టింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా శోభిత కూడా కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెడుతుందా?

అమల మాదిరి శోభిత కూడా హౌస్ వైఫ్‌గా ఉండగలదా.. అక్కినేని ఇంటి కోడలిగా శోభిత దూళిపాళ సమర్ధవంతంగా బాధ్యతలను చక్కబెడుతుందా, కాదు శోభిత తన అభిరుచికి తగ్గట్టుగా యాక్టింగ్‌ని కంటిన్యూ చేస్తుందా అనేది ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఉన్న అనుమానం. అసలు సమంతతో విడాకులకు కారణం కూడా అలాంటి గ్లామర్ రోల్స్ అనే ఇప్పటి వరకు వినిపిస్తూ వస్తుంది.

Will Shobhita follow Amala Akkineni?:

Naga Chaitanya Follows Nagarjuna.. What About Sobhita?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs