మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. రీసెంట్ గా ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన శ్రీలీల తాజాగా సోషల్ మీడియాలో వదిలిన పిక్స్ చూస్తే వావ్ శ్రీలీల అని అనకమానరు. మోడ్రెన్ అవుట్ ఫిట్ లో కత్తిలాంటి ఫోజులతో కిక్ ఇచ్చింది.
ఏమని వర్ణించను అన్నట్టుగా శ్రీలీల పై పిక్స్ కనిపిస్తున్నాయి. గ్లామర్ కి గ్లామర్, అందానికి అందం, లూజ్ హెయిర్, చెవులకి పెద్ద పెద్ద జుంకీలతో శ్రీలీల ఈ న్యూ లుక్ నిజంగా అద్భుతః అనిపించింది అంటూ ఆమె అభిమానులు మాత్రమే కాదు యూత్ మొత్తం కామెంట్ చేస్తుంది.
ఇక శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది. మరోపక్క సౌత్ ఆఫర్స్ తో శ్రీలీల మళ్ళీ బిజీ కాబోతుంది. నితిన్ రాబిన్ హుడ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న ఈ అమ్మడు రవితేజ తో సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్దమవుతుంది.