Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫ్యాన్స్ కి సారి చెప్పిన మృణాల్ ఠాకూర్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ పాల్గొంటున్నారు. రీసెంట్ గానే శంషాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆతర్వాత ప్రభాస్ సలార్ 2 అలాగే కల్కి 2 పూర్తి చేస్తారనుకుంటే.. ఆయన అనూహ్యంగా హను రాఘవపూడి తో ప్రాజెక్ట్ మొదలపెట్టేందుకు రెడీ అయ్యారు. 

Advertisement
CJ Advs

ఆగస్టు 17 న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోయే ప్రభాస్-హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఆ తర్వాత అంటే ఆగష్టు 18 నుంచే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిపోయేలా ప్లాన్ చేసేసారట. ఓ పది రోజుల పాటు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారట. అయితే  ప్రభాస్ ఓ సైనికుడిలా కనిపిస్తారని.. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లుగా వార్తలొచ్చాయి. 

తాజాగా ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ప్రభాస్‌తో మృణాల్ ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హను-ప్రభాస్ ఫౌజి ఫస్ట్ లుక్ అని క్యాప్షన్ పెట్టాడు. ఆ పిక్ పై మృణాల్ ఠాకూర్ స్వయంగా స్పందించింది. మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు సారీ. నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదు అని మృణాల్ చెప్పేసింది. 

దానితో అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ ఇద్దరూ డిజ్ పాయింట్ అవుతున్నారు. 

Mrunal Thakur once told Prabhas fans:

Is Mrunal Thakur reuniting with Prabhas for Fauji after Kalki
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs