కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ కి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ OG లో ఆఫర్ రావడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెకి బ్లాక్ బస్టర్ హిట్ లేదు, క్రేజీ హీరోయిన్ కాదు అయినప్పటికి ప్రియాంక కు పవన్ సినిమాలో అవకాశం రావడం పట్ల అందరూ షాకయ్యారు. సుజిత్ దర్శకత్వంలో ఇప్పటికే 80 పర్సెంట్ పూర్తయిన OG మిగతా షూటింగ్ ఆక్టోబర్ నుంచి మొదలు కానుంది.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ OG లుక్ పట్ల పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. గూస్ బంప్స్ తెప్పించే OG గ్లిమ్ప్స్ కూడా మాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసాయి. అయితే ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ అలకనంద కేరెక్టర్ లో చాలా సింపుల్ గా కనిపించనున్న విషయం తెలిసిందే.
అయితే ఆమె అలకనంద గా OG లో డాక్టర్ కేరెక్టర్ లో కనిపించబోతుంది, అలా పవన్ కళ్యాణ్ కి ప్రియాంక పరిచయమవుతుంది. పవన్ కళ్యాణ్-ప్రియాంక మోహన్ మధ్యన బ్యూటిఫుల్ సన్నివేశాలను దర్శకుడు సుజిత్ క్రియేట్ చేసినట్లుగా టాక్. మరి OG లో యాక్షన్ మాత్రమే కాదు బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయన్నమాట.