రేవంత్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసిన అనుమానం!
ఒకే ఒక అనుమానం తెలంగాణ ప్రభుత్వాన్ని ఊహించని చిక్కుల్లో పడేసిందా..! దీంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యిందా..! రేవంత్ సర్కార్ అనుక్కున్నదొక్కటి.. అయినది మరొక్కటి అన్న చందంగా పరిస్థితి తయారయ్యిందా..! బోల్తా పడ్డది ఎవరు..? బోల్తా కొట్టించింది ఎవరు..? దీనంతటికీ ఓ మహిళా ఐఏఎస్ చేసిన నిర్వాకమేనా..? ఈ దెబ్బతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రేవంత్ సర్కార్ పడిందా? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఏమిటా కహానీ..? తదుపరి చర్యలు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ఇదీ అసలు కథ..!
తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖలో రాష్ట్రానికి చెందిన కొన్ని సంస్థలు 1400 కోట్ల రూపాయలకుపైగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డినట్లు వాణిజ్యశాఖ అనుమానం వ్యక్తం చేసింది. మొత్తం 11 సంస్థలు ఎగవేతకు పాల్పడినట్లు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి గుర్తించారు. దీంతో జాయింట్ కమిషనర్ రవితో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అంతే లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా.. మొత్తం 11 సంస్థలు ఎగవేతకు పాల్పడినట్లు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి గుర్తించారు. దీంతో జాయింట్ కమిషనర్ రవితో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఇప్పుడు ఇదే తెలంగాణ ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది. అనుమానం పెనుభూతం అని పెద్దలు చెబుతున్నారు కదా.. ఇప్పుడు అదే అనుమానం రేవంత్ సర్కారును చిక్కుల్లో పడేసింది.
మేడమే కర్త.. ఖర్మ.. క్రియ!
ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1400 కోట్ల పన్ను ఎగవేత అనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే రంగంలోకి దిగి కేసును సీఐడీకి అప్పగించింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వర రావు, జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై సీఐడీ కూపీ లాగుతుండగానే సెంట్రల్ జీఎస్టీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎగవేత మొత్తంలో సగం తమకు రావాలని.. పన్ను ఎగవేతదారుల పేర్లు ఇవ్వాలని లేఖ రాసింది. ఇక్కడే అసలు ట్విస్టు బయటపడటంతో ప్రభుత్వ పెద్దలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భారీ మొత్తంలో పన్ను ఎగవేశారని ఫిర్యాదు చేసిన జాయింట్ కమిషనర్ రవిని సీఐడీ విచారించగా.. అప్పటి కమిషనర్ శ్రీదేవి చెబితేనే ఫిర్యాదు చేశానని, అంతకుమించి తనకేం తెలియదని జాయింట్ కమిషనర్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఇరుక్కుపోయిన సర్కార్..!
ఏంటి ఇది.. పూర్తి సమచారం, ఆధారాలు లేకుండా కేసులు పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఐఏఎస్ అధికారి టీకే శ్రీదేవి అనుమానం వ్యక్తం చేసిన వాటిలో కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఉండడంతో ఏం చేయాలో దుక్కుతోచని స్థితిలో పోలీసులు ఉన్నారట. ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో కేంద్ర సంస్థల వద్ద అడ్డంగా బుక్ అయ్యామని రాష్ట్ర వాణిజ్య శాఖలో పని చేసే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్, ట్రాన్స్ కో, ఎల్ఐసి, ఎన్ఎండిసీతో పాటు పలు సంస్థలు జీఎస్టీ ఎగవేసినట్టు కేసులు పెట్టడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉందట. సదరు ఐఏఎస్ చేసిన ఈ నిర్వహకంతో ఏం చేయాలో అర్ధం కాక ఆ లేడీ అధికారిణిని అక్కడి నుంచి బదిలీ చేసినట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడులో బోల్తా పడ్డది ఎవరు..? బోల్తా కొట్టింది ఎవరు.. ? ఇలా కొట్టించినది ఎవరు..? అనే విషయాలు ఫుల్ క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది కదా.. అదీ సంగతి. మరోవైపు.. కేంద్రం వాటా సంగతేంటి..? ఎగవేతదారులు ఎవరు..? అనేది చెప్పాలని ఢిల్లీ అధికారులు వెంటబడుతున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? ఈ వ్యవహారాన్ని ఎలా మేనేజ్ చేస్తారు..? కేంద్రానికి ఏమని సమాధానం చెబుతారో..? అనే తెలియాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూడక తప్పదు మరి.