Advertisement
Google Ads BL

దేవర చివరి షాట్: తారక్ పోస్ట్ వైరల్


మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం దేవర.. సెప్టెంబర్ 27న థియేటర్లకు భయమంటే ఏంటో చూపించడానికి సిద్ధమవుతోంది. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి పార్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా మొదటి పార్ట్‌కు సంబంధించి తారక్ పార్ట్ పూర్తయినట్లుగా అధికారికంగా మేకర్స్, అలాగే తారక్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Advertisement
CJ Advs

షూటింగ్ సెట్‌లో ఉన్న పిక్‌ని పోస్ట్ చేసిన తారక్.. దేవర పార్ట్ 1 నిమిత్తం నా చివరి షాట్‌ పూర్తయింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. సముద్రమంత ప్రేమను, అత్యద్భుతమైన టీమ్‌ని మిస్సవుతున్నాను. సెప్టెంబర్ 27న అందరినీ కొరటాల శివ రెడీ చేస్తోన్న దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో వేచి చూస్తున్నాను.. అని పోస్ట్ చేశారు. తారక్ పార్ట్ పూర్తయింది.. బిగ్ స్క్రీన్ మీద మాసివ్ ట్రీట్ చూసేందుకు అంతా సిద్ధం కండి అని చిత్రయూనిట్ కూడా ప్రకటించింది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్‌కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. వెయిటింగ్ అనేలా కామెంట్స్ చేస్తున్నారు. హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

Just wrapped my final shot for Devara Part 1 Tweeted by Jr NTR:

Devara Part 1 Latest Update From Young Tiger NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs