Advertisement
Google Ads BL

మై ఓన్లీ హోప్ మాస్ మహారాజా!


మై ఓన్లీ హోప్ మాస్ మహారాజ రవితేజ అన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో, రవితేజ హీరోగా నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కర్నూల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్.. తనకు లైఫ్ ఇచ్చింది రవితేజనే అంటూ మరోసారి గుర్తు చేసుకున్నారు.

Advertisement
CJ Advs

మిరపకాయ్ టైటిల్ మాస్ మహరాజానే పెట్టారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టింది కూడా ఆయనే. జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా నాకు ఆయనే ఇచ్చారు. మై ఓన్లీ హోప్ మాస్ మహారాజ రవితేజ. నేను ఈ స్టేజ్ మీద నిల్చోవడానికి కారణం ఆయనే. డైరెక్టర్‌గా షాక్‌తో జన్మనిచ్చి మిరపకాయ్ తో పునర్జన్మనిచ్చారు. ఆయన లేకుండా నా ఫిల్మ్ కెరీర్‌ని ఊహించలేను అని అన్నారు.

మిస్టర్ బచ్చన్ సినిమా గురించి చెబుతూ.. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఒక ఆర్నీలో పని చేశారని చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరూ సరిగా పనిచేయకపోయినా.. ఈ సినిమా ఇంత త్వరగా అయితే పూర్తయ్యేది కాదని అన్నారు. ముఖ్యంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫస్ట్ టైం నా కెరీర్‌లో నేను అడిగినదాని కంటే ఎక్కువ ఇచ్చిన నిర్మాత అని కొనియాడారు. అలాంటి టెక్నికల్ టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారని, వారందరికీ పేరుపేరునా హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.

Harish Shankar About Mass Maharaja Ravi Teja:

My Only Hope Mass Maharaja Ravi Teja Says Harish Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs