Advertisement
Google Ads BL

వేణు స్వామి అలా.. ఆయన భార్య వీణ ఇలా..


గతంలో ప్రభాస్ జాతకం, ఆయన పెళ్లిపై జ్యోతిష్కం చెప్పిన వేణు స్వామి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కి కూడా ప్రభాస్ జాతకం తెలియదు, నాకు తెలుసు అని బిల్డప్ ఇచ్చిన వేణు స్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేసారు. కానీ ఆయన భార్య వీణ-శ్రీవాణి ప్రభాస్ కి ఆర్గానిక్ ఫ్రూట్స్ పంపుతుంది. ప్రభాస్ పై నాకు కోపం లేదు, ఆయన ఆప్తుడు నాకు. నా వైఫ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ పంపిస్తే ఇంకా కావాలని ప్రభాస్ అడిగారని వేణు స్వామి ఆ వీడియోస్ షేర్ చేసాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ రోజే వారిద్దరూ విడిపోతారని, అది కూడా ఓ అమ్మాయి వల్ల అంటూ వేణు స్వామి చెప్పిన జాతకం ఆయన్ని చిక్కుల్లో పడేసింది. వేణు స్వామిపై పలువురు మహిళా కమిషన్ కి కంప్లైంట్ చెయ్యడం, మా అధ్యక్షుడు విష్ణు వేణు స్వామి పై చర్యలు తీసుకుంటాము అని చెప్పడంతో ఆయన ఇకపై సెలెబ్రిటీ జాతకాలు చెప్పను అన్నాడు. 

కానీ ఆయన వైఫ్ శ్రీవాణి మాత్రం నాగ చైతన్య-శోభితలు నిశ్చితార్ధం చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతూనే తనకి గిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. కాస్ట్లీ లువీస్ విట్టన్ హ్యాండ్ బాగ్ కావాలంటూ శ్రీవాణి చైతు-శోభితలను అడగడం చూసిన వారు.. అయ్యో వేణు స్వామి దొంగ జాతకాలూ చెబితే.. ఆయన భార్య ఇలాంటి పనులు చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Venu Swamy is like this.. His wife Veena is like this..:

Veena Srivani simultaneously requests a gift and congratulates Sobhita and Naga Chaitanya on their engagement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs