Advertisement
Google Ads BL

అది పర్సనల్: వైసీపీ శుద్ధపూసలు


వైసీపీ ఎమ్యెల్సీ దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి వ్యవహారం పర్సనల్ అంట. మరి పద్దతిగా విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ వ్యవహారం మాత్రం పర్సనల్ కాదు. నీతిమంతుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, నాలుగో భార్య అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు అది పవన్ కళ్యాణ్ పర్సనల్ కాదు. అది వాళ్లకు పబ్లిక్. 

Advertisement
CJ Advs

కానీ వాళ్ళ పార్టీ ఎమ్యెల్సీ భార్యతో రెండేళ్లుగా కలిసి ఉండకుండా మరొక ఆడదానితో కలిసి ఉంటూ భార్యను మోసం చేసే వాడి విషయంలో మాట్లాడమంటే మాత్రం అది వాళ్ళ పర్సనల్ అంటూ సమాధానం చెబుతారు వైసీపీ సుద్దపూసలు. దువ్వాడ శ్రీనివాస్ భార్యకు విడాకులివ్వకుండా దివ్వెల మాధురితో కలిసి ఉంటూ భార్యను మోసం చేసిన ఉదంతం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

రెండేళ్లుగా నన్ను రోడ్డు మీద వదిలేశారు, నన్ను మాధురి దగ్గరకు తీసుకుంది, ఆమె దగ్గరే ఉంటున్నా అంటూ పబ్లిక్ గా చెబుతున్న దువ్వాడ పై భార్య వాని, కూతుళ్లు న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పటికి ఏపీలో దువ్వాడ ఉదంతం హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. 

మరి తమ పార్టీ ఎమ్యెల్సీ విచ్చలవిడి తనం గురించి మాట్లాడకుండా.. అడిగినవారికి అది దువ్వాడ పర్సనల్ విషయం, మేము కల్పించుకోము అంటూ వైసీపీ శుద్ధపూసలు సమాధానమిస్తున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న కొడాలి, రోజా, అంబటి, బొత్స, జోగి రమేష్, చిదిరి, సజ్జల అందులోను అతిముఖ్యుడు జగన్ ఇప్పుడు దువ్వాడ విషయంలో సైలెంట్ గా పర్సనల్ అంటే సరిపోతుందా.. మీకో న్యాయం, వేరొకరికి ఓ న్యాయమా అంటూ ఏపీ ప్రజలు చేస్తున్న కామెంట్స్ చూసి వైసీపీ శుద్దపూసలు ఏం చెబుతారో..!

YSRCP Persons Reaction on Duvvada Incident:

It is Duvvada Personal Says YSRCP Leaders
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs