Advertisement
Google Ads BL

అందుకే చైతు జాతకం చెప్పా: వేణు స్వామి


చంద్రబాబు గెలవడు, జగన్ గెలిచి మరోసారి సీఎం గా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు.. అలా జరగలేదు అంటే వేణు స్వామి అనేవాడు జాతకాలు చెప్పడు అని ఛాలెంజ్ చేసిన వేణు స్వామి ఆ తర్వాత సీన్ రివర్స్ అవడంతో ఇకపై సెలెబ్రిటీ జాతకాలు చెప్పను అంటూ ప్లేట్ ఫిరాయించాడు. 

Advertisement
CJ Advs

తాజాగా మరోసారి వేణు స్వామి నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల జాతకం చెబుతాను అంటూ మొదలు పెట్టాడు. నాగ చైతన్య-శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్నరోజే.. వేణు స్వామి వీరిద్దరూ ఇపుడు కలుసుకుని పెళ్లి చేసుకున్నా 2027 లో విడిపోతారు, వారు విడిపోవడానికి ఓ లేడీ కారణమవుతుంది అని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ వేణు స్వామిపై ఫైర్ అయ్యారు. శుభమా అని పెళ్ళికి సిద్దమవుతున్న జంటపై ఇష్టమొచ్చిన జాతకాలు చెబుతావా అంటూ వేణు స్వామిని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు వేణు స్వామిపై కేసు కూడా నమోదు అయ్యింది. 

ఈ పంచాయితీ మా అధ్యక్షుడు మంచు విష్ణు వరకు వెళ్లడంతో వేణు స్వామి హడావిడిగా ఓ వీడియో వదిలాడు. నేను మూడు రోజుల క్రితం నాగ చైతన్య-శోభిత ల జాతకం చెప్పాను. గతంలో నాగ చైతన్య-సమంత జాతకం చెప్పాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా నాగ చైతన్య-శోభితల జాతకం చెప్పాను. అంతేకాని నేను ఇక మీదట సెలెబ్రిటీ, రాజకీయ నేతల జాతకాలు చెప్పను, మంచు విష్ణు ఫోన్ చేసారు, ఆయన ఎక్కడో ఉన్నారట, వచ్చాక కలుద్దామన్నారు అంటూ వేణు స్వామి చైతు-శోభిత జాతకం ఎందుకు చెప్పాడో అనేది వివరణ ఇచ్చాడు. 

Naga Chaitanya Horoscope is just an Extended Version - Venu Swamy:

Venu Swamy Prediction on Naga Chaitanya, Shobitha Horoscope
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs