బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ విషయంలో ఏం జరుగుతుందో అనేది మీడియా చాలా క్లోజ్ గా వాచ్ చేస్తుంది. వారిద్దరూ కలిసి కనిపించక పోయినా, లేదంటే ఏ చిన్న విషయంలో కొద్దిగా తేడాగా కనిపించిన సరే వారిద్దరూ సపరేట్ అవుతున్నారు, విడాకులు తీసుకుంటున్నారనే వార్త వైరల్ అయ్యి కూర్చుంటుంది.
రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్ళిలో అభిషేక్ ఫ్యామిలీ అయిన తండ్రి అమితాబ్, తల్లి జయ, అక్కతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఐష్ తన కూతురు ఆరాధ్యతో రావడంతో వారి విడాకుల మేటర్ వైరల్ అవడమే అటుంచి విడాకులు నిజమే అని అభిషేక్ చెబుతున్నట్లు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా అభిషేక్ బచ్చన్ ఈ విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. అది కూడా తన చేతికి ఉన్న పెళ్లి ఉంగరాన్ని చూపిస్తూ.. నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే అదంతా నిజమే అని మాట్లాడతారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి, ఇలాంటివి తీసుకోగలుగుతాం, కానీ క్షమించండి అంటూ ఉంగరాన్ని చూపించడంపై డివోర్స్ రూమర్ కి చెక్ పెట్టినట్లయ్యింది.