Advertisement

మెగాస్టార్ విశ్వంభర టీజర్ వచ్చేస్తుంది


ఈ నెల 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. మరి మెగాస్టార్ బర్త్ డే అంటే ఆయన అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. రక్తదానాలు, కేక్ కటింగ్స్, చిరు కొత్త సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ, ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన హడావిడి కనిపిస్తుంది. 

Advertisement

ఇక ఈ ఏడాది మెగాస్టార్ బర్త్ డే కి ఆయన వసిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభర నుంచి మెగా ఫ్యాన్స్ కోసం స్పెషల్ అప్ డేట్ రాబోతుంది అని తెలుస్తోంది. చిరు బర్త్ డే కి అంటే ఆగ‌స్టు 22న విశ్వంభర టీజ‌ర్ విడుద‌ల చేస్తున్నారు. టీజ‌ర్ క‌ట్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది. ఈ టీజర్ కి సంబంధించి కీర‌వాణి నేప‌థ్య సంగీతం, ఫైన‌ల్ ఎడిట్ బాలన్స్ ఉన్నాయట. 

ఇప్పటికే విశ్వంభర టీజర్ కట్ చూసిన యూనిట్ సభ్యులు విశ్వంభర టీజర్ పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. విజువ‌ల్స్‌, చిరు లుక్‌, హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో విశ్వంభర టీజర్ అద్భుతంగా ఉంది అంటున్నారు. మరి ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. ఆషిక రంగనాధ్, సురభి లాంటి హీరోయిన్స్ ఇందులో భాగమవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర విడుదల కాబోతుంది. 

Megastar Vishwambhara teaser is coming:

Chiranjeevi Vishwambhara Teaser on Aug 22
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement