Advertisement
Google Ads BL

వేణు స్వామి పై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం


ఆస్ట్రాలజర్ వేణు స్వామి సెలెబ్రిటీ హోదా కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతాడా అంటూ అక్కినేని అభిమానులు అగ్రం వ్యక్తం చేస్తున్నారు.  ప్రముఖుల జాతకాలు చెబుతాను అంటూ ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తూ వారి ఆగ్రహానికి గురవవుతున్న వేణు స్వామి కి ఏపీ ఎలక్షన్ గుణపాఠం నేర్పినా ఆయనలో ఏ మార్పు లేదు.

Advertisement
CJ Advs

సమంత తో విడాకులయ్యాక నాగ చైతన్య శోభిత దూళిపాళ్ళని ప్రేమించి పెళ్లికి రెడీ అయ్యాడు. రెండు రోజులక్రితమే నాగ చైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాల నడుమ సింపుల్ గా జరిగిపోయింది. చైతు-శోభితల ఎంగేజ్మెంట్ జరిగిన రోజే వేణు స్వామి వారిద్దరి జాతకాలూ చెబుతాను అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు.

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఓ లేడీ వల్ల విడిపోతారు, అది కూడా 2027 లోనే చైతు-శోభితలు విడిపోతారు, వారి ఎంగేజ్మెంట్ అయిన సమయం, వారి పేర్లు పరిశీలించి మరీ చెబుతున్నా అంటూ వేణు స్వామి చెప్పిన జాతకం చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. శుభమా అని నిశ్చితార్ధం చేసుకుని గంటలు గడవకముందే ఆ మాటలేంటీ, అసలు వాళ్ల జాతకం చెప్పమని మిమ్మల్ని అడిగిందెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున ఫ్యామిలీపై ఉన్నవి లేనివి మాట్లాడిన వేణు స్వామి ఎక్కడ దొరికితే అక్కడ అక్కినేని ఫ్యాన్స్ జాతర చెయ్యడం పక్కా అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. బెదిరించి పాపులారిటీ తెచ్చుకుందామని చూడటమే తప్పించి, వరస్ట్ క్యాండిటేట్ అంటూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆది రెడ్డి వేణు స్వామి పై ఫైర్ అయ్యాడు. 

Akkineni fans lashes out at Venu Swamy:

Venu Swamy About Akkineni Naga Chaitanya And Shobita
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs