బాలకృష్ణ-నాగార్జున మధ్యలో ఏం జరిగిందో.. ఇప్పుడున్న ఫ్యాన్స్ కి చాలావరకు అర్ధం కాదు. బాలకృష్ణ ఉన్న చోటుకి నాగ్ వెళ్లరు, నాగ్ ఉన్న ప్లేస్ కి బాలయ్య వెళ్లరు. అందుకే వారి కలయిక చూడాలని అటు నందమూరి అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు.
ఇప్పుడు బాలయ్య తో నాగార్జున ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కూర్చుంది. అది కూడా NBK టాక్ షో కి కింగ్ నాగ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మెగాస్టార్ అలాగే నాగార్జున బాలకృష్ణ- ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోకి హాజరుకాబోతున్నారట.
దసరాకి మొదలు కాబోతున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 కి ఈసారి ఖచ్చితంగా మెగాస్టార్, నాగార్జున హాజరయ్యేలా అరవింద్ గారు ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్. సో బాలయ్య-నాగార్జున ని ఆహా టాక్ షోలో ఒకే స్టేజ్ పై చూడడమే కాదు, వారు ఎలా, ఏమి మాట్లాడతారో అనేది కూడా ఇప్పుడు అందరికి ఆత్రుతే అన్నట్టుగా ఉంది.