Advertisement
Google Ads BL

బ్యాంకాక్‌లో బొత్స చిలిపి చేష్టలు.. వీడియో!


బొత్స కూడా ఆటగాడే.. వీడియో వచ్చేసిందోచ్!

Advertisement
CJ Advs

బొత్స సత్యనారాయణ.. సౌమ్యుడు, వివాదరహితుడు అని మంచి పేరుంది..! కానీ ఇదంతా పైకి కనిపించే మనిషి గురించే.. ఆయనలో కనిపించని మరొకరు ఉన్నారు..! అది బయటపడితే ఎలా ఉంటుందనేది ఒక్క వీడియోతో తేలిపోయింది..! వీడియో చూసిన తర్వాత బాబోయ్.. ఈయన బొత్సనేనా..? అని ఒకటికి రెండుసార్లు మీ కళ్లకు పరీక్ష పెట్టాల్సి వస్తుంది..! తీరా చూశాక అబ్బో.. మంచి ఆటగాడే అనే మాట టక్కున వచ్చేస్తుందంతే..! ఇంతకీ ఏమిటా వీడియో..? ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఎందుకొచ్చింది..? బ్యాంకాక్ వెళ్లి బొత్స చేసిన చిలిపి అంతకుమించి చిల్లర పనులేంటి..? సరిగ్గా ఇప్పుడే ఈ వీడియో బయటికి రావడం వెనుక ఏం జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!

ఎవ్వరూ తగ్గట్లేదే!

వైసీపీలో ఎవ్వరూ తగ్గట్లేదు.. పోటీపడి మరీ పత్యాపారాలను చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాడు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్.. నేడు విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారాలు వెలుగు చూడటంతో పెద్ద సంచలనమే అయ్యింది. ఈ వివాదాలన్నీ సద్దుమణగక ముందే.. తాజాగా బొత్స సత్యనారాయణ బ్యాంకాక్ వ్యవహారం వెలుగు చూడటంతో అభిమానులు, కార్యకర్తలు మొదలుకుని కుటుంబ సభ్యులు, వైసీపీ హైకమాండ్ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఈ వీడియో ఎప్పటిది..? ఆయన వెంట ఉండే యువతి/మహిళ ఎవరనేది క్లారిటీగా తెలియట్లేదు కానీ.. బ్యాంకాక్ వీధుల్లో మాత్రం తెగ విహరించేశారు బొత్స. చుట్టు పక్కలున్న అమ్మాయిలను చూస్తూ.. ఆ అందాలను ఆస్వాదిస్తూ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు. ఆయన్ను గుర్తు పట్టిన ఒకరు ఇదంతా తన ఫోన్‌లో చిత్రీకరించి నెట్టింట్లో వైరల్ చేశాడు. దీంతో బొత్స బండారం కూడా బయటపడినట్లయ్యింది.

చిలిపి చేష్టలు!

బొత్స వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పైకి కనిపించరు కానీ బొత్స కూడా మంచి ఆటగాడే అని కొందరు అంటుంటే.. అబ్బో చిలిపి, చిల్లర పనుల్లో వైసీపీ నేతలకు తోడయ్యారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని తెలుస్తోంది. పవర్‌ను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ను దోచుకుని.. ఎంతటి నీచపు పనులు చేశారో ఓ లుక్కేయండి అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఆ వీడియోలో ఉండే మహిళ ఎవరనేది క్లారిటీ రావట్లేదు కానీ.. భార్య ఝాన్సీ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో కుమార్తెతో తిరిగినా ఇలా ఏవేవో అంటగడతారేంటి..? అని గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు. ఇవన్నీ కాదు ఆమె ఓ ప్రముఖ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు. అయినా ఎన్నికల ముందు టీడీపీ ఈ జిమ్మిక్కులు చేస్తోందని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మరి.. ఈ వ్యవహారంపై బొత్స రియాక్ట్ అవుతారో.. అబ్బే అవన్నీ మామూలే అని లైట్ తీసుకుంటారో చూడాలి.

Botsa Satyanarayana Enjoying On The Streets Of Bangkok:

Botsa Satyanarayana 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs