ఐదేళ్లుగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో గోవా లో అంరంగవైభవముగా పెళ్ళాడి, హైదరాబాద్ లో అభిమానులకు గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చిన నాగ చైతన్య-సమంతలు పెళ్లి తర్వాత నాలుగేళ్ళ పాటు, ఉంటే ఇలాంటి జంటలా ఉండాలి అనిపించేలా కనిపించారు. కానీ ఆ తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో సమంత నుంచి నాగ చైతన్య విడాకులు తీసుకున్నాడు.
విడాకుల తర్వాత సమంత ని సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యని వారు లేరు. ఆమె ఎంతగా నలిగిపోయిందో అనేది సోషల్ మీడియా ద్వారా షేర్ చేసేది. ఆ తర్వాత విడాకుల బాధ నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సమంత విడాకుల విషయంలో సఫర్ అయిన విషయాన్ని అందరికి తెలిసేలా ప్రవర్తించింది. కానీ నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత ఎక్కడా ఆ విషయం ప్రస్తావించలేదు.
తాజాగా శోభిత దూళిపాళ్ళని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహము చేసుకోబోతున్న నాగ చైతన్య ని చూసి నాగార్జున సంతోషంగా ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయిన రోజే మా ఇంటికి కోడలుగా అడుగుపెడుతున్న శోభిత దూళిపాళ్ల కి స్వాగతం చెప్పిన నాగార్జున వీరిద్దరూ లైఫ్ లో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను.
ప్రస్తుతం నాగ చైతన్య హ్యాపీ గా ఉన్నాడు. సమంత తో విడాకుల తర్వాత నాగ చైతన్య చాలా నరకం అనుభవించాడు. ఎవ్వరికి చెప్పుకోకుండా తనలో తానే నలిగిపోతున్నాడు. ఇప్పుడు నా కొడుకు సంతోషంగా ఉన్నాడు. చైతు ని చూస్తుంటే మాకు ఆనందంగా ఉంది. శోభిత-చైతూల పెళ్ళికి ఇంకా కొద్దిగా సమయముంది. ఓ రెండు నెలల తర్వాత వారి వివాహం ఉంటుంది అంటూ.. నాగార్జున సోషల్ మీడియా వేదికగా చైతు సఫర్ అయిన విషయం చెప్పుకొచ్చారు.