Advertisement
Google Ads BL

కవిత జైలు నుంచి బయటికొస్తే..?


బరువు తగ్గిన కవిత.. కేటీఆర్ టెన్షన్!

Advertisement
CJ Advs

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యి.. తీహార్ జైల్లో సతమతం అవుతున్నారు..! ఒకటా రెండా పదుల సార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసినప్పటికీ.. ప్రతిసారీ కోర్టులు షాకులిస్తున్నాయే తప్ప మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే.. ఈ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ కవితేనని దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ గట్టిగా వాదించి.. బలమైన సాక్షాలతోనే కోర్టులకు వెళ్లి బెయిల్ అక్కర్లేదని పదే పదే చెప్పుకొస్తున్నాయ్. దీంతో కవిత పరిస్థితి అల్లకల్లోల్లంగా తయారైంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు కూడా.

చిగురిస్తున్న ఆశలు!

18 నెలల పాటు ఇదే లిక్కర్ కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు శుక్రవారం నాడు బెయిల్ వచ్చింది. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించడంతో.. కవితకు కూడా బెయిల్ వస్తుందని కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మధ్యనే ఢిల్లీ పర్యటనలో భాగంగా తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కవితను పరామర్శించి.. ఆరోగ్యంగా వాకబు చేశారు. చెల్లిని జైల్లో చైసిన అన్న చలింపోయి కంటితడిపెట్టారు.! మీడియా ముందుకు వచ్చి కవిత ఆరోగ్య పరిస్థితి, జైలు పరిస్థితులపై మీడియా మీట్ నిర్వహించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో కవితకు బెయిల్ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

అప్పీల్ చేశాం.. శుభవార్తే!

కవిత జైలులో చాలా ఇబ్బందులు పడుతోంది. ఇప్పటి వరకు 11 కిలోలు బరువు తగ్గింది. బీపీ వచ్చింది.. దాంతో రోజు రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తోంది. మనీష్ సిసోడియాకు బెయిల్ అంశం అనేది ఆలోచించి మాట్లాడాలి. రాజకీయంగా పోరాడాల్సి వచ్చిన సమయంలో ఇలాంటివి తప్పవు. కవిత బెయిల్ కోసం గురువారం నాడు అప్పీల్ చేశాం. వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందని బావిస్తున్నాం. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని ఆశిస్తున్నాం. ఖైదీలు 11 వేలు ఉండాల్సిన చోట 30 వేల మంది ఉన్నారు. జైలు పరిశుభ్రంగా లేదు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు భవిష్యత్‌తో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంటే కవిత రాగానే పార్టీలో ఏదైనా పెద్ద పదవి కట్టబెడతారేమో చూడాలి మరి. కేటీఆర్ మనసులో ఏముందో ఏంటో బీఆర్ఎస్ శ్రేణులకే తెలియాలి..!

If Kavitha gets out of jail..?:

Weight loss Kavitha.. KTR tension!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs