Advertisement
Google Ads BL

ఇదెలా సాధ్యమైంది చైతూ !!


నాగ చైతన్య సమంత ని ప్రేమలో పడేయ్యడమే పెద్ద షాకింగ్ విషయం. సమంత తో ప్రేమాయణం నడిపిన ఎవ్వరికి ఏ డౌట్ రాకుండా పెళ్లి పీటలెక్కించిన నాగ చైతన్య నాలుగేళ్ళ పాటు వారి పెళ్లి బంధాన్ని ప్రేమతో నిలబెట్టుకున్నారు. కానీ నాలుగేళ్ళ గడిచేసరికి వారి మధ్యన వున్న విభేదాలు విడాకులకు దారి తీశాయి.

Advertisement
CJ Advs

ఆ తర్వాత సమంత విడాకుల విషయంలో మానసికంగా నలిగిపోయింది, మయోసైటిస్ వ్యాధి ఆమెని కృంగదీసింది. నాగ చైతన్య ఎంత మధనపడినా దానిని బయటకి చూపించకుండా గుంభనంగా ఉన్నాడు. సమంత తో డివోర్స్ విషయంలో అందరూ సమంత నే బ్లేమ్ చేసారు కానీ.. ఎక్కడా నాగ చైతన్య ని విమర్శించలేదు.

కట్ చేస్తే నాగ చైతన్య మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. శోభిత దూళిపాళ్ళ తో నాగ చైతన్యకి ఎలా పరిచయమైంది. వీరిద్దరూ ఏ ప్రాజెక్ట్ లో కలిసి నటించలేదు, బయట వారిద్దరూ కలిసిన సందర్భాలూ లేవు. వెకేషన్స్ కి కూడా విడివిడిగా వెళ్లి అక్కడ కలిసేవారు ఏమో.. వారి డేటింగ్ న్యూస్ ఒక్కసారిగా గుప్పుమంది. అయినప్పటికి చైతు-శోభిత బయటపడలేదు. ఎంతగా చైతు-శోభితలపై ప్రచారం జరిగినా చాలామంది వీరి డేటింగ్ విషయంలో నమ్మకం చూపించలేదు.

ఇప్పుడు అనూహ్యంగా శోభిత దూళిపాళ్ళ -నాగ చైతన్య ఓ ఇంటివారు కాబోతున్నారు. అదే ఎవరికి అర్ధం కాని మిలియన్ డాలర్స్ ప్రశ్న. గురువారం శోభిత-నాగ చైతన్యలు ఎంగేజ్మెంట్ చేసుకుని నాగార్జున చేత అధికారికంగా భార్య భర్తలు కాబోతున్నట్టుగా ప్రకటన ఇప్పించడం చూసిన వారు ఇదెలా సాధ్యమైంది చైతు అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

How is this possible Chaitu !!:

Naga Chaitanya, Sobhita gets engaged
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs