అల్లు అర్జున్ కి పవన్ ఫ్యాన్స్ కి ఎప్పటినుంచో కోల్డ్ వార్ ఉంది. చెప్పను బ్రదర్ అన్నప్పటి నుంచి అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ చాలా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఆ కోపం కాస్తా ఈమధ్యన ఎలక్షన్ సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిని సపోర్ట్ చేయడంతో మరింత ఎక్కువైంది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై కోపంగా ఉందనే ప్రచారం ఉంది.
పవన్ కళ్యాణ్ ని పట్టించుకోకుండా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి డైరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వడం మెగా ఫ్యామిలిలో చాలామందికి నచ్చలేదు. పవన్ మనసులో ఏమున్నా అది ఎప్పటికి బయటికి రాదు అనుకున్నారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడా అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండా సినిమాల్లో స్మగ్లింగ్ చేస్తూ చెట్లు నరకడం ఇప్పుడు చూస్తున్నామంటూ అల్లు అర్జున్ పుష్పరాజ్ కేరెక్టర్ ని పవన్ ఇండైరెక్ట్ గా వేలెత్తి చూపించారు.
పవన్ కళ్యాణ్ బెంగుళూరు పర్యటనలో భాగంగా 40 సంవత్సరల క్రితం హీరో అంటే అడవులను కాపాడే వాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగిలింగ్ చేస్తున్నాడు, ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అంటూ పవన్ చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి మాట్లాడినవే అంటూ చాలామంది గుసగుసలాడుకుంటున్నారు.