Advertisement
Google Ads BL

డబుల్ ఇస్మార్ట్ చుట్టూ పాజిటివ్ వైబ్స్


ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం అవుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. రామ్-పూరి లు సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అవుతున్నారు. పూరి పై లైగర్ ఎఫెక్ట్ కానీ, రామ్ పై గత సినిమాల ఎఫెక్ట్ కానీ డబుల్ ఇస్మార్ట్ పై కనిపించడం లేదు. ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతున్న ఈ చిత్రానికి సెన్సార్ కూడా ఫినిష్ అయ్యింది. 

Advertisement
CJ Advs

సెన్సార్ వాళ్ళు డబుల్ ఇస్మార్ట్ కి A సర్టిఫికెట్ జారీ చెయ్యగా.. 2.42 నిమిషాల కట్ తో డబుల్ ఇస్మార్ట్ బరిలోకి దిగుతుంది. సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ రావడం సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ చేసింది. డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ అదిరిపోవడమే కాదు.. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు. 

మరోపక్క హీరోయిన్ కావ్య థాపర్ మెస్మరైసింగ్ గ్లామర్ కూడా డబుల్ ఇస్మార్ట్ కి అదనపు ఆకర్షణ కాబోతుంది. సో ఎటు చూసినా డబుల్ ఇస్మార్ట్ పై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మరి ఆగష్టు 15 పోటీలో డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ ఏమిటో ప్రేక్షకులు డిసైడ్ చేసే వరకు కాస్త వెయిట్ చెయ్యాల్సిందే!

Positive vibes around Double iSmart:

Double iSmart done with the censor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs