Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ కి కూడా జాన్వీ నే కావాలా?


సౌత్ లో అలా అడుగుపెట్టిందో లేదో గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ వెంట సౌత్ స్టార్ హీరోస్ పడిపోతున్నారు. ఎన్టీఆర్ దేవర తో సౌత్ లోకి అడుగుపెడుతున్న జాన్వీ కపూర్ కి ఆ చిత్రం విడుదల కాకుండానే రామ్ చరణ్ తో ఛాన్స్ కొట్టేసి పెద్ద షాక్ ఇచ్చింది. హిందీలో సక్సెస్ లేకపోయినా అమ్మడు బ్యూటీ సినిమాలకు అదనపు ఆకర్షణ అవుతుంది, అందులోను శ్రీదేవి వారసురాలిగా ఆ క్రేజ్ ఉంటుంది అని సౌత్ మేకర్స్ ఆలోచన.

Advertisement
CJ Advs

అందుకే ఆమె లక్కు సౌత్ లో ఎలా ఉందో కూడా పట్టించుకోకుండా అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ హీరోలతోనే కాదు ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్ కూడా జాన్వీ కపూర్ జోడిగా వస్తే బావుంటుంది అనుకుంటున్నాడట. ఆయనే పుష్ప తో నేషనల్ అవార్డు విన్ అయిన అల్లు అర్జున్.

ప్రస్తుతం పుష్ప 2 ముగించే దిశగా అడుగులు వేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి మూవీని తివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ కోసం గత ఆరు నెలలుగా పాన్ ఇండియా స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచనలో ఉన్నారట.

అయితే ఆగష్టు లో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో అనౌన్సమెంట్ ఇచ్చినప్పటికీ ఎన్టీఆర్ తో జాన్వీ చేస్తున్న దేవర విడుదలై దాని రిజల్ట్ చూసాకే జాన్వీ కపూర్ పై ఫైనల్ డెసిషన్ కి వస్తారనే టాక్ కూడా స్టార్ట్ అయ్యింది. చూద్దాం అల్లు అర్జున్ సరసన జాన్వికి చోటు దొరుకుతుందా, లేదా అనేది.

Allu Arjun Gunning For Janhvi Kapoor:

Allu Arjun is considering pairing with Janhvi for his next film after Pushpa 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs