Advertisement
Google Ads BL

దానితో సంబంధం లేదంటున్న యాంకర్ సుమ


బుల్లితెర పై సుమ కనకాలను కొట్టే యాంకర్ లేదు అంటే నమ్మాలి. సినిమా ఇండస్ట్రీలో ప్రతి సెలెబ్రిటికి సుమ అంటే ఇష్టం, బుల్లితెర ఆడియన్స్ కి అయితే చెప్పక్కర్లేదు. సుమ షో వస్తుంది అంటే కళ్లప్పగించి చూడాల్సిందే.. ఆమె వ్యాఖ్యాతగా అందరికి దగ్గరైపోయింది. ఆమె జోకులు, ఆమె చెప్పే డైలాగ్స్ కి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫిదా అవ్వాల్సిందే. 

Advertisement
CJ Advs

ఆమెకి కూడా స్టార్ హీరోలకున్న ఫ్యాన్ ఫాలింగ్ ఉంది. సోషల్ మీడియాలో సుమని ఫాలో అవ్వని వారు ఉండరేమో. ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే సుమ మొన్నామధ్యన మీడియా వారితో స్నాక్స్, భోజనం అంటూ జోక్ వేసి అడ్డంగా బుక్కయ్యింది. ఇప్పుడు తాజాగా సుమ మరో వ్యవహారంలో ఇరుక్కుంది. 

సుమ చెప్పినందు వలనే(సుమ యాడ్ చూసి) మేము రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌ లో ప్లాట్స్ కొన్నామని, కోట్లు పెట్టి  మోసపోయామంటూ కొంతమంది మీడియాకి ఎక్కారు. సుమ వలనే మేము ఆ ప్లాట్స్ కొని మోసపోయామంటూ లబోదిబో మంటున్నారు. ఆ వివాదంపై సుమ కూడా స్పందించింది. 

రాకీ అవెన్యూస్ అనే సంస్థతో తాను గతంలో అంటే 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకుని, ప్రమోషన్ కోసం యాడ్ చేశాను. కానీ ఇప్పుడు ఆ సంస్థతో తనకు ఎలాంటి లావాదేవీలు, సంబంధం లేదని.. తనకు సంబంధించిన పాత యాడ్ వీడియోను వారు అక్రమంగా వినియోగించుకున్నారని సుమ వివాదం పై క్లారిటీ ఇచ్చింది. 

Anchor Suma says it has nothing to do with it:

Suma clarity about Rakhi avenue ventures issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs