అల్లు అర్జున్ 2024 ఎలక్షన్ టైమ్ లో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంపై మెగా ఫ్యామిలిలోనే కాదు మెగా ఫ్యాన్స్ లోను అసహనం కనిపించింది. మెగా ఫ్యామిలీ లో నాగబాబు అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ ట్వీట్ చెయ్యగా, సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి ని అన్ ఫాలో చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
అప్పటి నుంచి మెగా vs అల్లు ఫ్యామిలీస్ మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే టాక్ వైరల్ గా మారింది. నాగబాబు పవన్ విషయంలో అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు పై ఆగ్రహంగానే ఉన్నా మీడియా ముందు అది కనిపించకుండా కవర్ చేస్తున్నారని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు.
నాగబాబు కొద్దిరోజులుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో అభిమానుల చిట్ చాట్ లో అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఒక అభిమాని అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్ అని ప్రశ్నించగా, పుష్ప 2 కోసం వెయిటింగ్ చేస్తోన్నా అంటూ నాగబాబు కామెంట్ చేశారు.
మరొక అభిమాని అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు మీరు అని అడిగితే అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ అని నాగబాబు సమాధానమిచ్చాడు.