ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ ఎంత ఎనర్జీ లుక్స్ తో, యాక్టింగ్ తో అదరగొట్టేశాడో.. హీరోయిన్స్ నభ నటేష్, నిధి అగర్వాల్ లు గ్లామర్ తో యూత్ ని అంతే చొంగ కార్చుకునేలా చేసారు. ఇస్మార్ట్ మాస్ హిట్ లో హీరోయిన్స్ ఇద్దరి అందాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పుడు నభ నటేష్, నిధి అగర్వాల్ లు లేకుండానే డబుల్ ఇస్మార్ట్ రాబోతుంది.
కానీ ఇస్మార్ట్ శంకర్ కి మించి డబుల్ ఇస్మార్ట్ లో గ్లామర్ డోస్ ఉండబోతుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడనిపించేలా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. హీరోయిన్ కావ్య థాపర్ అందాలు ఆరబోత వేరే లెవల్ అనేలా ఉంది. డబుల్ ఇస్మార్ట్ లో కావ్య థాపర్ గ్లామర్ రోల్ తో అందాలు ఆరబోసే పని పెట్టుకుంది.
కేవలం సినిమాలోనే కాదు డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లోను కావ్య థాపర్ అందాలు హైలెట్ అవుతున్నాయి. అందాలు చూపించే అవుట్ ఫిట్స్ లో కావ్య థాపర్ గ్లామర్ షో చేస్తూ అందరి చూపు తనవైపు ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ప్రస్తుతం కావ్య థాపర్ గ్లామర్ షో గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకోవడమే దానికి నిదర్శనం.