సలార్ 2 ఎప్పుడు పట్టాలెక్కుతోంది. ప్రశాంత్ నీల్ ఎందుకు ముందుగా ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. డిసెంబర్ లో ఎప్పుడో సలార్ పార్ట్ 1 రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సలార్ 2 విషయం చెప్పడం లేదు. మే నుంచి సలార్ 2 ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ మొదలవుతుంది, మిగతా 20 పర్సెంట్ ఎంతసేపు ఫినిష్ చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ ప్రభాస్ డేట్స్ ఇవ్వడం లేదో, లేదంటే ప్రశాంత్ నీల్ అప్పుడే సలార్ 2పై ఫోకస్ పెట్టడం ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ.. ముందుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉండడం కాదు.. ఆగష్టు 9 న మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఎన్టీఆర్-నీల్ మూవీ ఓపెనింగ్స్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా టాక్.
దానితో ప్రభా ఫ్యాన్స్ లో బెంగ మొదలయ్యింది. సలార్ 2సెట్స్ మీదకి వెళితే ఆ క్రేజే వేరు. కానీ ఇలా ప్రశాంత్ నీల్ దానిని పక్కనపెట్టడం ఏమిటి అని వాపోతున్నారు. కానీ ప్రభాస్ సైడ్ నుంచి లేట్ అవడంతోనే సలార్ 2 షూటింగ్ ఇంకా సెట్స్ మీదకి వెళ్లకపోవడానికి ప్రధానకారణమనే మాట ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.