నిజంగా ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కారణం పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా బ్రేకిచ్చిన షూటింగ్స్ మళ్ళీ కదలబోతున్నాయని తెలుస్తుంది. తాను డిప్యూటీ సీఎం అయ్యాక మూడు నెలల పాటు సినిమాల వైపు రాలేను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల విషయంలో పునరాలోచనలో ఉన్నారట. తన వలన నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ఆయన ఇకపై సినిమాలకు టైమ్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వచ్చి తాను మధ్యలో వదిలేసిన సినిమాలను పూర్తి చేస్తారట. అందులో ముందుగా దానయ్య-సుజిత్ ల OG ని పవన్ కంప్లీట్ చేస్తారని, ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తో హరి హర వీరమల్లు కూడా పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఈమద్యలో పవన్ అప్పుడప్పుడు తన బాధ్యతల కోసం ఏపీకి వెళ్ళొస్తారట.
ఇక్కడ దర్శకుడు సుజిత్ కూడా పూర్తి ఏర్పాట్లలో ఉన్నాడట. పవన్ రాగానే చకచకా షూటింగ్ పూర్తి చెయ్యాలని రెడీ అవుతున్నాడట. OG కి పవన్ కళ్యాణ్ కొద్దిపాటి డేట్స్ కేటాయిస్తే సరిపోతుంది అని.. అందుకే ముందుగా పవన్ OG ని కంప్లీట్ చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఇది పవన్ ఫ్యాన్స్ కి సంతోషాన్నిచ్చే న్యూసే కదా.!