హైపర్ ఆది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేనకు సపోర్ట్ చెయ్యడమే కాదు.. అపుడపుడు జగన్ పై కామెడీ కూడా చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గెలవాలని జబర్దస్త్ కమెడియన్స్ కంకణం కట్టుకున్నారు. 2024 ఎలక్షన్ లో పవన్ గెలవడం జరిగింది. వైసీపీ 11 మంది ఎమ్యెల్యేలతో సరిపెట్టుకుని ఘోరమైన ఓటమి తెలిసిందే. అప్పటి నుంచి జగన్ క్రికెట్ టీం ని తయారు చేసాడు 11 మందితో అంటూ మీమ్స్ వినిపిస్తున్నాయి.
ఆది మరోసారి జగన్ 11 మంది ఎమ్యెల్యేలపై చేసిన ఇండైరెక్ట్ కామెడీ హైలెట్ అయ్యింది. నిహారిక ప్రొడ్యూసర్ గా రాబోతున్న కమిటీ కుర్రాళ్ళు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న హైపర్ ఆది మాట్లాడుతూ.. నిహారిక గారు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి లాగే ట్రెండ్ ఫాలో అవదు.. ట్రెండ్ సెట్ చేస్తుంది. 11 మంది హీరోలతో సినిమా అంటే ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా, కాదా..
11 మంది హీరోలంటే, రీసెంట్ గా 11 మంది క్రికెటర్స్ మన దేశానికీ వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ 11 మంది మన నిహారిక గారికి విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తుకు వస్తాయి.. అని ఆది అనగానే గ్యాలరీ లో ఆడియన్స్ విజిల్స్ వేస్తూ కేరింతలు కొట్టారు. మరి హైపర్ ఆది ఆ 11 గుర్తు చెయ్యడమంటే వైసీపీ ఎమ్యెల్యేలు అనేగా దానర్ధం అంటూ అడుగుతున్నారు.
అంతేగా.. అంతేగా 11 అనగానే ఏపీలో జగన్ ఆయన ఎమ్యెల్యేలు గుర్తుకు రావాల్సిందే కదా.!