నందమూరి బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం పై ఎప్పుడో చెప్పి ఇప్పటివరకు కామ్ గా ఉండడం పై నందమూరి అభిమానుల్లో చిన్నపాటి కినుకు ఉన్నప్పటికి.. ఈఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ పై వస్తోన్న అప్ డేట్స్ అధికారం కాకపోయినా.. వారి ఆనందానికి అవధులు లేవు.
మోక్షజ్ఞ హీరో మేకోవర్ చూసి ఫుల్ హ్యాపీ గా ఉన్న అభిమానులకు.. బాలయ్య మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ హనుమాన్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మని దర్శకుడిగా ఎంచుకుని, నిర్మాతగా కుమార్తె తేజస్విని రంగంలోకి దించుతున్న బాలయ్య తన వారసుడు తెరంగేట్రం మూవీ పై ఎప్పుడెప్పడు అధికారిక ప్రకటన ఇస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ అయ్యింది అది.. బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకల్లో కొడుకు ఎంట్రీ పై ప్రకటన చేయబోతున్నారట. అంతేకాదు సెప్టెంబర్ 6 మోక్షజ్ఞ బర్త్ డే రోజున మోక్షు డెబ్యూ మూవీని అతిరథ మహారథుల మధ్యన మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
అంతేకాదు మోక్షజ్ఞ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై ఓ కొత్త న్యూస్ మొదలయ్యింది. అది శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ మోక్షజ్ఞ సరసన నటించబోతుంది అంటూ ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది నిజంగా నందమూరి అభిమానులకు స్వీట్ న్యూస్ అనే చెప్పాలి.