ఈరోజు సాయంత్రం విడుదల కాబోతున్న దేవర సాంగ్ బాగోకపోతే మీకుంటది సామి అంటూ లిరికిస్ట్ రామ జోగయ్య శాస్త్రిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది. దేవర సెకండ్ సాంగ్ పై రామజోగయ్య శాస్త్రి కొద్దిరోజులుగా హైప్ పెంచడం చూసిన కొంతమంది ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతుండగా మరికొందరు.. శాస్త్రిగారి మీద డౌట్స్ తో ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు.
దేవర నుంచి సెకండ్ సింగిల్ తంగం అంతరంగం పాటను మేకర్స్ ఈరోజు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి దానికి సంబందించిన అప్ డేట్స్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల రొమాంటిక్ స్టిల్స్ ని వదులుతున్నారు. అటు రామజోగయ్య శాస్త్రి కూడా ఈ పాట పై క్రేజ్ తెచ్చేందుకు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
అంటే అన్నానంటారు గానీ
అద్దిద్దిద్దిద్దిరిపోయింది పాట
ఆ జంట కన్నుల పంట
మాధుర్యపు తూగుటుయ్యాల ❤️
Thanku @tarak9999 garu Thanku #Sivagaru for choosing me❤️
Thanku dear @anirudhofficial garu In our telugu terms U “pindified” d melody❤️ Not to forget @RathnaveluDop Sir❤️
ప్రియతముడికి ఇలాంటి పాట పడి చాలా కాలమయింది కానీ చాలా మంది చాలా కాలం గుర్తుంచుకుని పాడుకునే పాట కుదిరేసింది...రేపు విని మీరే అంటారా మాట ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఎక్కువ చెబితే దిష్టి తగుల్తుంది..శుభరాత్రి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అంటూ శాస్త్రి గారు ట్వీట్లు వేస్తూ హడావుడి చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం
ఒకప్పుడు మాస్ ఫైట్స్ కోసం ఎదురు చూసే వాళ్ళం, ఇప్పుడు సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నాము thanq sir @ramjowrites 🙏❣️ పొంగిపోతుంటే, మరొకరు..
ఇంత హైప్ లేపుతున్నారు... అంతలా లేకపోవాలి... మీకు ఉంటుంది సార్.. Trolling... అంటూ బెదిరిసున్న ట్వీట్స్ కి హైప్ కాదు నిజం
సాయంత్రం మళ్ళీ చెప్పు ఇక్కడే ఉంటా అంటూ శాస్త్రిగారు బదులిస్తున్నారు.