దేవర ముంగిట నువ్వెంత అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు సరే.. కానీ ఇప్పుడు దేవర ముంగిట ఇలాంటి రిజల్టా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 27 న పాన్ ఇండియాలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న దేవర మూవీ పై భారీ అంచనాలున్నాయి. రేపు సోమవారం దేవర తంగం అంతరంగం సాంగ్ రాబోతుంది.
అయితే ఈ చిత్రానికి పాన్ ఇండియా హైప్ తెచ్చేందుకు కొరటాల శివ ఏరి కోరి హీరోయిన్ గా శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ కి అక్కడ మాత్రం సక్సెస్ దరి చేరడం లేదు. వరస సినిమాలు చేస్తూ దండెత్తుతున్నా జాన్వీ కపూర్ ని విజయం పలకరించడం లేదు.
దేవర విడుదలకు ఇంకా 50 డేస్ మాత్రం టైమ్ ఉంది. ఇలాంటి సమయంలో జాన్వీ కపూర్ కి హిందీలో మరో సినిమా షాకిచ్చింది. గుడ్ లక్ జెర్రీ, మిలి, రూహీ, గుంజన్ సక్సేనా ఇప్పుడు ఉలజ్. ఇలా జాన్వీ కపూర్ హిందీ సినిమాలన్నీ ప్రేక్షకులకు పరీక్ష పెట్టాయి. ఉలజ్ రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ దిశగా పయనం మొదలు పెట్టింది.
విడుదలకు ముందు రోజే అడ్వాన్స్ బుకింగ్స్ మరీ వీక్ గా ఉండటం, విడుదలయ్యాక ఈ చిత్రానికి వచ్చిన టాక్ అన్ని దర్శక నిర్మాతలను ముంచేసాయి. జాన్వీ కపూర్ నటన కూడా రెండు మూడు సీన్స్ లో తప్ప ఎక్కడా మెప్పించలేదు. మరి ఉలజ్ రిజల్ట్ చూసాక అమ్మా జాన్వీ.. దేవర ముంగిట ఇలాంటి రిజల్టా అని కామెంట్ చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒణుకు మొదలయ్యింది.