Advertisement
Google Ads BL

ట్రోల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ చూస్తే నవ్వాపుకోలేరు. ఈమధ్యన బిగ్ సినిమాస్ అప్ డేట్స్ వస్తుంటే ఇతర హీరోల ఫ్యాన్స్ వాటిని ట్రోల్ చెయ్యడానికి కాచుకుని కూర్చుంటున్నారు. అదృష్టం బావుంటే ఆ అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి. లేదంటే అవి మీమ్స్ కింద మారి ట్రోల్ అవుతున్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కారణం ఆయన నటించిన GOAT లైఫ్ నుంచి వచ్చిన థర్డ్ సింగిల్ ప్రోమో. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా నుంచి రాబోతున్న స్పార్క్ సాంగ్ లో విజయ్ లుక్స్ కానీ తన డాన్స్ మూమెంట్స్ కానీ దారుణంగా ట్రోల్ కి గురవుతున్నాయి.

ముఖ్యంగా విజయ్ లుక్స్ పై విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వైరల్ గా మారాయి. ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేకుండా, అలాగే ఫేస్ లో కళ  లేదు, విజయ్ వయసు కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. అసలు హీరోయిన్ ముందు విజయ్ తేలిపోవడం అన్ని విజయ్ ని ట్రోల్ చేసేలా చేసాయి. 

అటు విజయ్ ఫ్యాన్స్ లోను ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. విజయ్ తెలిసే ఇలాంటివి ఒప్పుకుంటున్నాడా అనే ఆవేదన ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. 

Kollywood star hero being trolled:

Thalapathy Vijay de-aged look gets trolled 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs