Advertisement
Google Ads BL

జగన్ తప్పేమి లేదంటారా?


జగన్ ఓటమి పాలవడం వెనుక జగన్ తప్పేమి లేదంటారా.. ఎంత సేపు ఆయన చుట్టూ ఉన్న వాళ్లే జగన్ ని ముంచేశారు అని మాట్లాడుతున్న బ్లూ మీడియా.. జగన్ కి ఆ మాత్రం తెలివి లేకుండా ఐదేళ్ల పాలన, ఐదేళ్ల రాజకీయం చేసాడంటారా.. ఎంతవరకు ఆయన చుట్టూ కోటరిగా మారిన నలుగురు వ్యక్తులు వలనే జగన్ ప్రజలని, కార్యకర్తలను, మంత్రులను పట్టించుకోలేదు అంటూ పదే పదే మాట్లాడడం ఏమిటో ఏపీ ప్రజలకు అర్ధం కావడం లేదు.

Advertisement
CJ Advs

జగన్ ఓటమి తర్వాత కూడా పాఠం నేర్వకుండా ఇంకా కోటరీ మీదే ఆధారపడి ఉన్నాడు అంటూ ఇప్పటికీ బ్లూ మీడియా నుంచి రాగం వినిపిస్తుంది. తాజాగా ఆయన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి వాళ్ళ సాధకబాధకాలు వింటున్నారు. కానీ నిన్న శుక్రవారం జగన్ ని కలిసేందుకు వచ్చిన కొంతమంది వైసీపీ అభిమానులను బయటికి గెంటేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అందులోను  జగన్ తప్పేమి లేదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే జగన్ కి తెలియకుండా ఇలాంటివి చేస్తున్నారు. కార్యకర్తలు ఇంకా జగన్ కి దగ్గర చేరకుండా అడ్డుకుంటున్నారు. గతంలోనూ సలహాదారే సీఎం లా ఫీలై మంత్రులతోను, ఎమ్యెల్యేలు, కార్యకర్తలతో మాట్లాడేసేవారు, జగన్ కి ఏమి తెలియనిచ్చేవారు కాదు.. అందుకే జగన్ 2024 లో ఘోరంగా ఓడిపోయారంటూ బ్లూ మీడియా నెత్తి నోరు కొట్టుకుంటుంది.

ఫోన్ వాడను అని సిల్లీగా చెప్పాడు సరే, అసలు జగన్ టీవీ చూడడా.. ఎవ్వరూ బయట జరిగే విషయాలు జగన్ కి చేరవేయరా, టీవీ లో ఏ ఛానల్ మార్చినా, లేదంటే సోషల్ మీడియా చూసినా జగన్ విషయంలో జరిగేది తెలిసిపోతుంది. కానీ జగన్ కి ఇవేమి తెలియవంటే కామెడీగా లేదు, గతంలో ఇప్పుడు విమర్శిస్తున్న బ్లూ మీడియా కూడా జగన్ చేసే తప్పులను ఏమార్చలేదా.. అప్పుడు కనిపించలేదా ఆ కోటరీ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Is there anything wrong with Jagan?:

Do you really care about Jagan?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs