Advertisement
Google Ads BL

తట్టుకోలేకపోతున్నా అంటున్న కీర్తి సురేష్!!


మహానటి కీర్తి సురేష్ ఇపుడు మోడ్రెన్ కీర్తి సురేష్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో రకరకాల మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో అందాలు చూపించడానికి రెడీ అయిన కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. సరదాగా ఉండే కీర్తి సురేష్ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. తన స్నేహితురాలిని మిస్ అయినందుకు ఎమోషనల్ అవుతుంది. 

Advertisement
CJ Advs

గత కొన్ని వారాలుగా బ్రతకడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. నా చిన్నప్పటి ఫ్రెండ్ బ్రెయిన్ ట్యూమర్‌తో దాదాపు 8 ఏళ్ల పాటు పోరాడింది. కానీ పోరాడి పోరాడి అలిసిపోయి ఇంత చిన్న వయసులో మరణించడం అనేది తట్టుకోలేకపోతున్నా, మూడు సర్జరీలు జరిగినా బలమైన సంకల్పంతో ఉండడం నేను చూసాను. అలాంటి దృఢ సంకల్పం ఉన్న వారిని నేను ఎక్కడా చూడలేదు. 

నేను తనని కలిసిన చివరిసారి తాను ఆ నెప్పితో భరించలేకపోతున్నాను అంటూ చాలా ఏడ్చింది. కానీ నేను తన ముందు ఎమోషన్ అవ్వకుండా నా బాధను దాచుకున్నాను. కానీ బయటికి రాగానే ఆ కారిడార్ లోనే ఏడ్చుకుంటూ వచ్చేసాను. తాను బ్రతకాలని, ఎన్నో కలలు నెరవేర్చుకోవాలని అనుకుంది. కానీ ఇంత చిన్న వయసులో తనువు చలించడం అనేది నిజంగా బాధాకరవిషయం. ఆ విషయం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ గా కీర్తి సురేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

Keerthy Suresh Insta Post About Her Friend Death:

Keerthy Suresh Shares Emotional Post About Her Childhood Friend Demise
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs