Advertisement
Google Ads BL

రోజాకు జగన్ అంటే.. నాకు పవన్ అంటే ఇష్టం


జబర్దస్త్ లో జెడ్జ్ స్థానం లో ఉన్న రోజా పై జబర్దస్త్ కమెడియన్స్ చాలా భక్తి, గౌరవం చూపించేవారు. రోజా కాళ్ళ మీద పడిపోయేంత భక్తి కమెడియన్స్ లో కనిపించేది. దాదాపుగా పదేళ్ల అనుబంధం వాళ్ళది. రోజా మినిస్టర్ అయ్యాక జబర్దస్త్ వదిలేసింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో ఉంటూ జనసేన నేత పవన్ కళ్యాణ్ ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేది. ఈసారి పవన్ ని ఎలాగైనా గెలిపించాలంటూ 2024 ఎన్నికల్లో జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ వెనుక నిలబడ్డారు. 

Advertisement
CJ Advs

దానితో రోజా జబర్దస్త్ కమెడియన్స్ పై ఎలా బడితే అలా మాట్లాడ్డం, ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ రోజా పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం అన్నిచూసాం. 2024 ఎలక్షన్ లో రోజా ఓడిపోయాక ఆర్పీ లాంటి వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడినా హైపర్ ఆది, సుధీర్ లాంటి వాళ్ళు ఎక్కడా రోజా పై ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. 

తాజాగా హైపర్ ఆది రోజా ఓటమిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని హైపర్ ఆదిని ప్రశ్నించగా.. రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి, ఆవిడంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. నేను ఇంతగా పాపులర్ అవడానికి రోజా కూడా ఓ కారణం. రాజకీయాలకు అతీతంగా ఆవిడపై నాకు గౌరవం ఉంటుంది అంటూ ఆది చెప్పుకొచ్చాడు. 

Roja like Jagan.. I like Pawan: Hyper Aadi:

Hyper Aadi about ex minister Roja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs