హీరో రవితేజ కొన్నాళ్ళుగా సక్సెస కోసం పరితపిస్తున్నారు. క్రాక్ తర్వాత రవితేజ సినిమాలన్ని నిరాశపరుస్తూనే ఉన్నాయి. మధ్యలో ధమాకా 100 కోట్లు కొల్లగొట్టినా ఆ సక్సెస్ లో ఎక్కువ శాతం శ్రీలీలే పట్టుకుపోయింది. ఆ తరవాత కూడా రవితేజ వరసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. తనకి మిరపకాయ్ తో మంచి విజయాన్నందించిన హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ ని ట్రాక్ ఎక్కించాడు.
మిస్టర్ బచ్చన్ చిత్రంపై ప్రస్తుతం మంచి అంచనాలున్నాయి. యూత్ మొత్తం ఎప్పుడెప్పుడు మిస్టర్ బచ్చన్ ని వీక్షిద్దామా అని వెయిట్ చేస్తున్నారు. కారణం హీరోయిన్ భాగ్యశ్రీ అందాలు. మిస్టర్ బచ్చన్ నుంచి వస్తున్న ప్రతి సాంగ్ ప్రోమో కూడా భాగ్యశ్రీ బోర్సే అందాలతో హైలెట్ అవుతుంది, ప్రతి అవుట్ ఫిట్ లో భాగ్యశ్రీ మెస్మరైజ్ చేస్తుంది.
అలానే ఆమె ఒంపు సొంపులు మిస్టర్ బచ్చన్ పై యూత్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అయితే భాగ్యశ్రీ బోర్సే అందాలు మిస్టర్ బచ్చన్ ని ఎంతగా హెల్ప్ అవుతాయో అనేది అంచనా వెయ్యడం కష్టం. సాంగ్స్ లో గ్లామర్ చూపించినా ఆమె కేరెక్టర్ లో అంత గ్లామర్ ఉంటుందా, ఆమె కేరెక్టర్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది అనుమానమే.
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ పై ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. మరి ఆగష్టు 15 న విడుదలకు రెడీ అయిన మిస్టర్ బచ్చన్ కి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందాలు ఎంతవరకు పని చేస్తాయో చూడాలి.