నవీన్ పోలిశెట్టి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కామెడీ తో కూడుకున్న సినిమాలే. నవీన్ కామెడీ టైమింగ్ కి ఫిదా కాని ప్రేక్షకుడు ఉండదు. ప్రతి సినిమాలో నవీన్ పోలి శెట్టి సరదా సరదా కేరెక్టర్స్ తోనే మెప్పించాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అవడంతో సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.
అమెరికాలో జరిగిన బైక్ యాక్సిడెంట్ లో నవీన్ పోలిశెట్టి కుడి చేతికి ఫ్రాక్చర్ అవడంతో ఆయన ప్రస్తుతం షూటింగ్స్ చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఖాళీగా కూర్చుని ఏం చేస్తాం అనుకున్నాడో లేదంటే అభిమానులకు దూరమవుతున్నాను అనుకున్నాడో తెలియదు కానీ.. నవీన్ పోలిశెట్టి ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఆ వీడియో లో చేతికి సంబందించిన సీన్స్ చూస్తూ నవీన్ పోలిశెట్టి ఫ్రస్టేట్ అవడమే కాదు.. ఆ సీన్స్ తో చాలా కామెడీ చేసాడు. వెంకటేష్, మెగాస్టార్ సినిమా సీన్స్ లో చెయ్యి చూసావా రఫ్ గా ఉంది అనే సీన్స్ చూసి తన చేతిని చూసుకుని నవీన్ ముందా టీవీ మార్చండిరా అనడమే కాదు, డాన్స్ లోను హాండ్స్ అప్ అంటూ వచ్చిన సాంగ్ చూసి తన చేతిని చూసుకుని ఫీలవడం..
ఇంకా లంచ్ తినేటప్పుడు ఫ్రాక్చర్ అయిన హ్యాండ్ తో తినలేక లెఫ్ట్ హ్యాండ్ తో తింటుంటే.. కడుక్కునే చేతితో తింటావా సంస్కారం లేదా అని అనగానే రెండు హ్యాండ్స్ పక్కనపెట్టి నోటితో ప్లేట్ లో ఉన్న అన్నం తింటూ సంస్కారం ముఖ్యం అంటూ ఫన్నీ గా చేసిన నవీన్ కామెడీ ఇప్పుడు వైరల్ గా మారింది.